Annavaram: కార్తికమాసం సందర్భంగా కాకినాడ జిల్లాలోని అన్నవరం దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తికమాసం కావడంతో ఆలయ క్యూ లైన్లు, వ్రత మండపాలు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీతో.. పశ్చిమ రాజగోపుర ద్వారాలను ఆలయ అధికారులు మూసివేశారు. తూర్పు రాజగోపురాల వద్ద క్యూ లైన్లలో తోపులాట జరిగింది. అప్రమత్తమైన అధికారులు.. అక్కడ ఆలయ సిబ్బందిని పెట్టారు. గత వారం ఆలయంలో తొక్కిసలాటతో అధికారులు అప్రమత్తమయ్యారు.
అన్నవరం ఆలయానికి పోటెత్తిన భక్తులు.. నిండిన క్యూలైన్లు - అన్నవరం ఆలయం వద్ద రద్దీ
Annavaram: అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయం కిటకిటలాడుతోంది. తొక్కిసలాట జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
అన్నవరంలో భక్తుల రద్దీ