ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంను ముంచెత్తిన వరద.. పునరావస కేంద్రాలకు బాధితుల తరలింపు - godavari flood effect on yanam

Godavari flood effect on Yanam : గతంలో ఎన్నడూ లేనంతగా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంను గోదావరి జలాలు ముంచెత్తాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 20 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదలటంతో.. యానాంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురైయ్యాయి. ముంపు ప్రాంతాలను పుదుచ్చేరి, దిల్లీ ప్రత్యేక ప్రతినిధి పడవపై వెళ్లి పరిశీలించారు. బాధితులను పునరావస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.

flood effect on yanam
flood effect on yanam

By

Published : Jul 15, 2022, 4:14 PM IST

యానంను ముంచెత్తిన వరద.. పునరావస కేంద్రాలకు బాధితుల తరలింపు

Godavari flood effect on yanam : తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 20 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేయడంతో గోదావరి నది పరివాహక ప్రాంతం ముంపునకు గురైంది. కాకినాడ జిల్లాలో అంతర్భాగం.. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన యానాం ముంపునకు గురైంది. పర్యాటక ప్రాంతాలైన బాలయోగి, రాజీవ్ గాంధీ బీచ్, భరతమాత విగ్రహం వద్ద భారీ స్థాయిలో వరద ప్రవాహం పెరిగింది. ముంపు ప్రాంతాలను పుదుచ్చేరి దిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పడవపై వెళ్లి పరిశీలించారు. బాధితులను పునరావస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.

  • ధవళేశ్వరం వద్ద గోదావరిలో పెరిగిన వరద ఉద్ధృతి
  • కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
  • కాటన్‌ బ్యారేజీపై వాహన రాకపోకలు నిలిపివేత
  • ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 18.30 అడుగుల నీటిమట్టం
  • ధవళేశ్వరం నుంచి పంట కాల్వలకు 5 వేల క్యూసెక్కులు విడుదల
  • సముద్రంలోకి 20 లక్షల క్కూసెక్కులు విడుదల

ABOUT THE AUTHOR

...view details