ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Gadapa Gadapa Program in AP: గడప గడపలో ఎమ్మెల్యేలకు భంగపాటు.. ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్న ప్రజలు - గడప గడప

Gadapa Gadapa Program in AP: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు నిరసన సెగలు తప్పడం లేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏం చేశారని నిలదీస్తున్నారు. ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక చాలా మంది వెనుదిరుగుతున్నారు.

Gadapa_Gadapa_Program_in_AP
Gadapa_Gadapa_Program_in_AP

By

Published : Aug 5, 2023, 11:27 AM IST

Gadapa Gadapa Program in AP: రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడంలో బిజీ అయ్యారు. పార్టీ పెద్దల నుంచి వస్తున్న ఆదేశాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే గడప గడపకు వెళ్లిన ప్రజాప్రతినిధులకు భంగపాటు తప్పడం లేదు. ఏ గ్రామానికి వెళ్లినా ఏం చేశారు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రజలు అడిగే వాటికి సమాధానాలు చెప్పలేక కొద్దిమంది నాయకులు అసహనం వ్యక్తం చేస్తే.. మరికొంతమంది వెనుదిరుగుతున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు నిరసన సెగ ఎదురైంది.

Protest against YCP leaders: సమస్యలు పట్టించుకోకుండా గాలికొదిలేశారు.. నేదురుమల్లి రామ్​కుమార్​ రెడ్డికి నిరసన సెగ

Protest to MLA Jyothula Chantibabu: తమ కాలనీకి కుళాయిలు వేస్తేనే ఓట్లేస్తామని ఏ మహిళ తెగేసి చెప్పిన ఘటన కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో చోటుచేసుకుంది. ఈ గ్రామంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో స్థానిక మహిళ నాగమణి మాట్లాడారు. తమ ప్రాంతంలో కుళాయిలు వేయాలని స్థానిక నేతలను అడుగుతుంటే రేపు, ఎల్లుండి అని సాకులు చెబుతున్నారే తప్ప ఎవరూ వేయించడం లేదని అన్నారు. ఇప్పుడు అందరూ కాలనీల్లో తిరుగుతున్నారు.కుళాయిలు వేస్తేనే ఓట్లు వేస్తాం అని మహిళ అనడంతో త్వరలోనే నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎమ్మెల్యే బదులిచ్చారు. డ్రైనేజీ సమస్య, రేషన్​కార్డులు, పింఛన్ల కోసం పలువురు ఎమ్మెల్యే వద్ద ప్రస్తావించగా సంబంధిత అధికారులను పిలిచి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.

గెలిచాక ఈ ఊరు మొహం చూశారా..? ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డికి నిరసన సెగ..

Woman Questioned Adoni MLA Sai Prasad Reddy: కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివారులోని తమకు సంబంధించిన 70సెంట్ల స్థలాన్ని ఆక్రమించి, బలవంతంగా లాక్కున్నారని.. ఓట్లు వేసి గెలిపించినందుకు మంచి పనే చేశారని శాంతి అనే మహిళఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్​రెడ్డిని గట్టిగా నిలదీసింది. ఎవరిని అడుగుతున్నావు.. ఏ స్థలం అని మహిళను ఎమ్మెల్యే ఎదురు ప్రశ్నించారు. మీ పేరు సాయిప్రసాద్​రెడ్డే కదా.. మీ కొడుకు పేరు జయమనోజ్​రెడ్డే కదా.. ఎవరి చేతుల్లో స్థలం ఉందో మీకు తెలియదా అని ఆమె తిరిగి ప్రశ్నించారు. పక్కనే ఉన్న వార్డు నాయకుడు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. మహిళ కోపం తగ్గలేదు. చేసేది లేక ఎమ్మెల్యే సముదాయిస్తూ ముందుకు సాగిపోయారు.

MLA Sivakumar with Student అన్నన్నా.. ఎమ్మెల్యే అన్నాబత్తుని మాటలు విన్నారా! అవాక్కైన లబ్ధిదారులు..!

ఆదోని పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యేకు ఎదురైన అనుభవం ఇది. తాగునీటి సమస్య, పింఛన్​ పంపిణీ, ఇంటి పట్టా, విద్య, వసతి దీవెన, రేషన్​ సరుకు పంపిణీ, ఇంటి స్థలం మంజూరు కాకపోవడంపై పలువురు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఇంటింటి చెత్త పన్ను చెల్లించలేకపోతున్నామని, మినహాయించావని కాలనీ మహిళలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే స్పందిస్తూ పన్ను చెల్లించకపోతే అభివృద్ధి పనులు ఎలా జరుగుతాయన్నారు. చెల్లిస్తే చెల్లించండి, లేదంటే లేదని సలహా ఇచ్చారు.

Gadapa Gadapaku Program: 'ఏం చేశారని వైసీపీకి ఓటేయాలి'.. ఎమ్మెల్యే ద్వారంపూడికి నిరసన సెగ..

ABOUT THE AUTHOR

...view details