ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంచినీటి చెరువులో చేపలు మృతి.. ఏం జరిగింది..? - పిఠాపురం చెరువులో చేపలు మృతి

Fishes died: కాకినాడ జిల్లా పిఠాపురం మంచి నీటి చెరువులో చేపలు మృతి చెందడం కలకలం రేపింది. చెరువులోని నీరు కలుషితమవ్వడం వల్లే చేపలు, ఇతర జీవులు మృత్యువాత పడుతు‌న్నాయని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. అదే నీటిని సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.

చేపలు మృతి
చేపలు మృతి

By

Published : Jun 24, 2022, 8:15 PM IST

కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణానికి తాగునీరు సరఫరా చేసే మంచి నీటి చెరువులో భారీగా చేపలు మృతి చెందడం కలకలం రేపింది. చిత్రాడలో 44 ఎకరాల విస్తీర్ణంలోని మంచి నీటి చెరువులో రెండు రోజులుగా చేపలు, పాములు చనిపోతున్నాయి. కాగా ఈ నీటినే పిఠాపురంలోని మూడు ట్యాంకులకు పంపించి.. పట్టణంతోపాటు, శివారు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. చనిపోయిన చేపల్ని.. పురపాలక సంఘ అధికారులు పూడ్చి పెట్టారు.

మంచినీటి చెరువులో... చేపలు మృతి.. మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే

చెరువులోని నీరు కలుషితమవ్వడం వల్లే చేపలు, ఇతర జీవులు మృత్యువాత పడుతు‌న్నాయని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. అదే నీటిని సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు అధికారులు మాత్రం వాతావరణం చల్లబడి చేపలు చనిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details