గోదారమ్మ శాంతించినా.. యానాం వద్ద తగ్గని వరద ప్రవాహం - యానాం తాజా వార్తలు
Flood at Yanam: భద్రాచలం వద్ద గోదారమ్మ శాంతించినా.. నది పరివాహక ప్రాంతాలు ఇంకా నీటిలోనే మగ్గుతున్నాయి. గౌతమి గోదావరి నదికి ఆనుకుని ఉన్న యానాం పట్టణ ప్రజలు మాత్రం గడిచిన వారం రోజులుగా కంటిమీద కునుకు లేకుండా ఉన్నారు. మూడు దశాబ్దాల తర్వాత అతి భారీ వరదలు పట్టణంలోకి ప్రవేశించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అల్లాడిపోయారు. ఉదయం నుంచి వరద ప్రభావం తగ్గినా ధవళేశ్వరం నుంచి వస్తున్న వరద కారణంగా గోదావరికి ఆనుకుని ఉన్న బాలయోగి నగర్, ఓల్డ్ రాజీవ్ నగర్, సుభద్ర నగర్, అయ్యన్న నగర్, వైఎస్సార్ కాలనీ, అబ్దుల్ కలాం నగర్, ఫరంపేట గ్రామాలు ఇంకా వరద నీటిలోనే మగ్గుతున్నాయి. ప్రస్తుత యానాం వద్ద గోదావరి నీటిమట్టం నాలుగు అడుగులకు చేరింది.
గోదారమ్మ శాంతించిన.. యానాం వద్ద తగ్గని వరద ప్రవాహం