Coastal Erosion at Kakinada: ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు సముద్ర తీరపు మత్స్యకారులు భయభ్రాంతులకు గురవుతున్నారు.. ఎక్కడ తమ ఇళ్లు సముద్రంలో కలిసి పోతాయోనని బెంబేలెత్తిపోతున్నారు.. తమను ఆదుకునేవారి కోసం దీనంగా ఎదురుచూస్తున్న సముద్ర తీర ప్రజల కష్టాలివీ. భారీ వర్షాల కారణంగా గత కొన్ని నెలలుగా ఉపాధి కోల్పోయిన గంగపుత్రులకు ఉండడానికి నీడలేని పరిస్థితి ఏర్పడింది.. కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని మత్స్యకారులు ఒక్కొక్క ఇంట్లో చిన్న గుడిసెలో రెండు, మూడు కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. గతంలో రూ.12 కోట్లతో సముద్రతీరం వెంబడి జియో ట్యూబ్ నిర్మించినా.. అది క్రమేనా సముద్రంలో కలిసిపోయింది.
సముద్ర కోతతో బెంబేలెత్తుతున్న గంగపుత్రులు.. సాయం కోసం ఎదురుచూపు - Coastal Erosion at Kakinada
Coastal Erosion at Uppada: కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ మత్సకారులు తుఫానుల ధాటికి భయాందోళనకు గురవుతున్నారు. తమ ఇళ్లు కడలిలో కలసి పోకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. గతంలో 12కోట్ల వ్యయంతో తీరం వెంబటి నిర్మించిన జియో ట్యూబ్ సముద్రంలో కలిసిపోయింది. నిత్యం తీర ప్రాంతం కోతకు గురవుతూ.. మత్సకారులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. వెంటనే రక్షణ గోడ నిర్మించి తమను ఆదుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు.
అదే తరహాలో తీరప్రాంతం మత్స్యకారుల గృహాలు సైతం సముద్రలో కలుపుకుంది. ఆ ప్రాంత మత్స్యకారులు మూడు పూటలా తినటానికి తిండితో పాటుగా తలదాచుకోవడానికి గూడు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు వందలాది ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి. నిత్యం తీర ప్రాంతం కోత గురవుతూ.. ఇక్కడి వారికి తీవ్రమైన నష్టం కలిగిస్తోంది తీర ప్రజలంతా తీర ప్రాంతంలో ఉండటానికి భయపడుతూ.. అద్దె గృహాలు వెతుక్కునే దుస్థితి ఏర్పడింది. వెంటనే రక్షణ గోడ నిర్మించి తమను ఆదుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.