ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు కాకినాడలో సీఎం జగన్ పర్యటన- జనసమీకరణకు నేతల పడరానిపాట్లు - సీఎం జగన్ కాకినాడ పర్యటన

CM YS Jagan Visit Kakinada: సీఎం జగన్ నేడు కాకినాడలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అయితే అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు సహా వివిధ సంఘాలన్నీ నిరవధిక సమ్మెలో ఉండటంతో జనసమీకరణకు నేతలు నానా తంటాలు పడుతున్నారు.

CM_YS_Jagan_Visit_Kakinada
CM_YS_Jagan_Visit_Kakinada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2024, 8:38 AM IST

కాకినాడలో సీఎం జగన్ పర్యటన- జనసమీకరణకు నేతల పడరానిపాట్లు

CM YS Jagan Visit Kakinada: సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉందంటే చాలు ఆ ప్రాంత ప్రజలంతా హడలిపోతున్నారు. సీఎం టూర్ సందర్భంగా అ‍ధికారులు ప్రదర్శించే అత్యుత్సాహం ఏం అవస్థలు తెస్తాయో అని బెంబేలెత్తిపోతున్నారు. చెట్ల నరికివేత, ట్రాఫిక్‌ నిలిపివేత, పర్యటనకు రాకపోతే ఊరుకునేది లేదన్న అధికారుల హుకూంతో నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు సీఎం సభకు భారీగా జనసమీకరణకు నేతలు పడరానిపాట్లు పడుతున్నారు.

ముఖ్యమంత్రి మన ఊరు వస్తున్నారంటే అభివృద్ధి పనులు ప్రారంభిస్తారనో, కొత్త వరాలు కురిపిస్తారనో ప్రజలు సంతోషిస్తారు. కానీ జగన్ వస్తున్నారంటే సామాన్య ప్రజలతో పాటు అధికారులు హడలిపోతున్నారు. 2 రోజులు ముందుగానే ఏర్పాటు చేసే బారీకేడ్లతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు, ఆంక్షలతో వాహనదారులకు నరకయాతన పడుతున్నారు. ఇప్పటివరకు అంగన్వాడీలు, డ్వాక్రా మహిళలు, ఒప్పంద ఉద్యోగులతో సభలు నింపేవారు. ఉద్యోగుల ఆందోళనతో ఇప్పుడు పింఛన్‌దారులు తప్పనిసరిగా రావాల్సేందని హుకుం జారీచేశారు.

సీఎం జగన్ పర్యటనలో మహిళల ఇక్కట్లు - 'పాల్గొనకుంటే 50రూపాయల ఫైన్'

ముఖ్యమంత్రిజగన్ నేడు కాకినాడలో పర్యటించనున్నారు. వైఎస్సార్ పింఛన్ పెంపు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్ని ఆయన ప్రారంభించనున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో సీఎం సభకు భారీగా జనసమీకరణకు ప్రజాప్రతినిధులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు సహా వివిధ సంఘాలన్నీ నిరవధిక సమ్మెలో ఉండటంతో జనసమీకరణకు నేతలు పడరానిపాట్లు పడుతున్నారు.

ఆసరా పింఛన్లు 3వేల రూపాయలకు పెంచుతుండటంతో లబ్ధిదారులంతా తప్పనిసరిగా సీఎం సభకు రావాల్సిందేనని వాలంటీర్ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. సీఎం సభకు రానివాళ్లకు పింఛన్లు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. భారీగా జన సమీకరణ కోసం కాకినాడ నగరం, గ్రామీణం, కరప, కాజులూరు, తాళ్లరేవు మండలాల్లోలి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

CM Jagan Yemmiganur Tour Arrangements: సీఎం పర్యటన అంటేనే.. హడలిపోతున్న ప్రజలు

వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి నాలుగన్నరేళ్లు దాటినా పట్టించుకోని అభివృద్ధి పనుల(Development works)ను ఎన్నికల వేళ సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. జిల్లా పరిషత్ సెంటర్ నుంచి భానుగుడి సెంటర్‌కు అనుసంధానం చేసే కొండయ్యపాలెం వంతెనను ప్రారంభించనున్నారు. 2009లో ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఎట్టకేలకు పనులు పూర్తి కావడంతో ఈ వంతెనకు మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ(Former minister Mutta Gopalakrishna) వారధిగా పేరు మార్చి సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేశారు.

ముత్తా గోపాలకృష్ణ కుమారుడు ముత్తా శశిధర్ జనసేన పీఏసీ సభ్యుడి(Janasena PAC Mutta Sashidhar) గా కొనసాగుతున్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే వంతెనకు ఆయన పేరు పెట్టారని తెలుస్తోంది. కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో వివేకానంద పార్క్‌(Vivekananda Park)లో స్కేటింగ్‌ రింగ్ నిర్మించారు. ఇన్నాళ్లు పట్టించుకోని పనులను హడావుడిగా చేపట్టి సీఎంతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details