ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు కాకినాడలో సీఎం జగన్ పర్యటన.. వైఎస్సార్​ కాపు నేస్తం పథకం నిధులు విడుదల - undefined

CM Jagan Tour: ఇవాళ వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్న సీఎం.. అక్కడే నిధులు విడుదల చేయనున్నారు.

CM Jagan
CM Jagan

By

Published : Jul 28, 2022, 8:00 PM IST

Updated : Jul 29, 2022, 1:44 AM IST


Kakinada Tour: ముఖ్యమంత్రి జగన్‌ నేడు కాపు నేస్తం పథకం నిధులు విడుదల చేయనున్నారు. ఉదయం తొమ్మిదిన్నరకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం.. పదిన్నరకు కాకినాడ జిల్లా గొల్లప్రోలు చేరుకోనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని.. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత సాయాన్ని విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన.. అర్హులైన పేద మహిళలకు ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున సాయం అందించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు గొల్లప్రోలు నుంచి తిరుగుపయనం కానున్న సీఎం.. ఒకటిన్నరకు తాడేపల్లికి చేరుకుంటారు.

Last Updated : Jul 29, 2022, 1:44 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details