ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

STATUE: కదల్లేని ప్రతిమ.. కదిలించే జ్ఞాపకమై - రాఖీ పండుగ

RAKHI : కావాల్సిన వాళ్లు దూరమైతే ఆ బాధ తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. మరణించిన వారి జ్ఞాపకాలనే.. అనుబంధానికి గుర్తుగా పదిలపరచుకుంటారు. కాకినాడలో కూడా ఇలానే జరిగింది. రక్షాబంధన్‌ వస్తే తోబుట్టువులు నలుగురు కలిసి ఆనందంగా పండగ చేసుకునేవారు. వారిలో ఒకరు రోడ్డు ప్రమాదంలో దూరమైతే మిగతా ముగ్గురు తట్టుకోలేకపోయారు. ఆమె విగ్రహాన్ని చేయించి ఈ ఏడాది రాఖీ పండుగను ఊరంతా పండగలా నిర్వహించారు.

STATUE
STATUE

By

Published : Aug 12, 2022, 10:54 AM IST

RAKHI CELEBRATIONS: రక్షాబంధన్‌ వస్తే తోబుట్టువులు నలుగురు కలిసి ఆనందంగా పండగ చేసుకునేవారు. వారిలో ఒకరు రోడ్డు ప్రమాదంలో దూరమైతే మిగతా ముగ్గురు తట్టుకోలేకపోయారు. ఆమె విగ్రహాన్ని చేయించి ఈ ఏడాది రక్షాబంధన్‌ను ఊరంతా పండగలా నిర్వహించారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన గాబు మణి(29) అనే మహిళకు వివాహమై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 7 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆమె దుర్మరణం చెందారు. ఆమె అకాల మృతిపై అక్క వరలక్ష్మి, అన్నయ్య శివ, తమ్ముడు రాజా తీవ్రంగా ఆవేదన చెందారు. జ్ఞాపకాలను పదిలపరచుకొనేందుకు విగ్రహాన్ని చేయించుకున్నారు. రక్షాబంధన్‌ వేడుక వేళ గురువారం తోబుట్టువులు ఆ సోదరి విగ్రహాన్ని ఊరిలో ఊరేగించారు. చివరికి తమ ఇంటి వద్ద ప్రతిష్ఠించుకున్నారు. ‘ఏటా రాఖీ పండుగను అంతా కలిసి ఆనందంగా జరుపుకొనే వాళ్లం. ఈసారి ఆమె లేని లోటు తీర్చలేనిది. ఆమె మా మదిలో నిరంతరం స్మరించుకునేలా విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం’ అని తెలిపారు. ద్విచక్ర వాహన ప్రమాదంలో సోదరి మాకు దూరమైంది. బైక్‌పై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి అని గ్రామంలో ప్రచారం చేశారు.

ABOUT THE AUTHOR

...view details