Sri Viswa Viznana Vidya Aadhyatmika Peetham Mahasabhalu: కాకినాడ జిల్లాలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో 95వ వార్షిక మహాజ్ఞాన సభలు ఈరోజు ప్రారంభమయ్యాయి. పీఠం ప్రాంగణంలో 3 రోజుల పాటు ఈ సభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పీఠాధిపతి ఉమర్ ఆలీషా మాట్లాడుతూ కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలతో కూడిన అరిషడ్వర్గాల వలన మానవుడు భ్రాంతి శక్తులకు లోనవుతున్నాడని అన్నారు. భ్రాంతి వలన కష్టాలను అనుభవించడానికి మానవుడు ఇష్టపడడని.. అందువల్లే తన కష్టాలు తీర్చమని స్వామీజీలను, గురువులను దర్శిస్తూ ఉంటాడని పేర్కొన్నారు. కష్టాన్ని ఇష్టపడి స్వీకరిస్తే భ్రాంతి శక్తి తొలగిపోతుందని తెలిపారు.
అనంతరం నివేదిక 2023, వేదాంతం నుంచి జాతీయతా భావం వైపు గ్రంధాన్ని పీఠాధిపతి సభలో ఆవిష్క రించారు. ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ట్రస్ట్ వారు చిన్నారుల కోసం పాలకేంద్రం, శిశు సంరక్షణా కేంద్రాలను, ప్రాథమిక వైద్య శిబిరాలతో పాటుగా 27 కేంద్రాలను ఏర్పాటు చేశారు.