Kidney transplant : గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రెండు గంటల్లో కాకినాడ అపోలో నుంచి వైజాగ్ కిమ్స్కి రోడ్డు మార్గం ద్వారా కిడ్నీ తరలించారు. కాకినాడకు చెందిన నరేందర్.. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందాడు. కిడ్నీ తరలింపు సమయంలో సిటీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపివేశారు. పోలీసులు దారి మొత్తం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. వైజాగ్ కిమ్స్ లో పేషంట్ కి కిడ్నీ అమర్చడానికి డాక్టర్లు ఏర్పాట్లు చేశారు.
నాగేంద్ర సింగ్(42) ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో కాకినాడ అపోలో ఆస్పత్రిలో చేరాడు. నాగేంద్ర సింగ్ బ్రెయిన్ డెడ్ కావడంతో రెండు కిడ్నీలను ఆమె భార్య సత్యభాయి మరో ఇద్దరికి దానం చేసింది. కాకినాడకు చెందిన వ్యక్తికి అపోలో ఆస్పత్రిలో కిడ్నీ ఇవ్వగా, మరో వ్యక్తికి విశాఖపట్నం కిమ్స్ హాస్పిటల్ కిడ్నీని పంపడం జరిగింది. ఈ విషయాన్ని అపోలో మెడికల్ సూపరింటెండెంట్ డా.చటర్జీ మృతుల కుటుంబాలకు తెలిపారు. విశాఖపట్నం కిడ్నీ తరలించేందుకు పోలీసులు ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సహకరించారు. వైద్యుల కృషి, పోలీసుల సహకారంతో ఇరువురికి పునర్జన్మ దక్కింది.