Fear of Corona Virus: కరోనా భయం ఆ కుటుంబాన్ని వెంటాడింది. దీంతో తల్లీకూతుళ్లు రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. బాహ్య ప్రపంచమనేదే మరిచిపోయారు. ఎవరితోనూ మాట్లాడకుండా నాలుగు గోడల మధ్యే ఉండిపోయారు. ఈ ఘటన కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరులో జరిగింది. తల్లి మణి, కుమార్తె దుర్గాభవానికి మానసిక సమస్యలున్నాయి. వీరు మొదటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నారు. వీరి ఆలనా పాలన మణి భర్త సూరిబాబు చూసుకుంటున్నారు. కరోనా వచ్చిన తర్వాత తల్లీకూతుళ్లు మరింత భయాందోళనకు గురయ్యారు. ఎవ్వరికీ కనిపించకుండా పూర్తిగా ఇంటికే పరిమితమైపోయారు. వారే ఆహారం తయారు చేసుకుని.. లోపల ఇంటిలోపలే ఎవరికీ కనపడకుండా ఉండిపోయారు. ఏ శుభకార్యాలకూ వెళ్లే వారు కాదు.
కరోనా భయం.. మూడేళ్లుగా ఇంట్లోనే తల్లీకూతుళ్లు.. ఎక్కడంటే? - కరోనా భయం
Fear of Corona Virus: ప్రజల జీవితాలలో కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో చాలా మంది భయంతోనే ప్రాణాలు విడిచిన విషాద ఘటనలు చూశాం. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గి మళ్లీ ప్రజలు సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. కానీ గత మూడేళ్లుగా కరోనా భయంతో కాకినాడ జిల్లాకు చెందిన తల్లీ, కూతురు ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.
కరోనా భయం
ఏళ్లు గడుస్తున్నా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో గ్రామస్థులు తల్లీకూతుళ్ల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, వైద్య సిబ్బంది తల్లీకూతుళ్లను బలవంతంగా కాకినాడ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇవీ చదవండి:
Last Updated : Dec 20, 2022, 5:54 PM IST