జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అమరావతిలో నిర్మించనున్న తూర్పు ప్రాంత ఘాట్(ఈస్ట్రన్ ఘాట్ రీజనల్ సెంటర్) నిర్మాణానికి ఆ శాఖ సంచాలకులు డాక్టర్ ఖైలాష్ చంద్ర భూమి పూజ చేశారు. తూర్పు ప్రాంత ఘాట్ నిర్మాణానికి తుళ్లూరు సమీపంలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు రెండు ఎకరాలు కేటాయించారు. కొవిడ్ నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండా కేవలం ఆ శాఖకు చెందిన కొంతమంది అధికారులతోనే భూమి పూజ నిర్వహించారు. దేశంలోని 16 ప్రాంతాల్లో జూలాజికల్ సర్వే కార్యాలయాలున్నాయని ఖైలేష్ చంద్ర చెప్పారు. హైదరాబాద్ పక్షుల సంరక్షణకు అనుకూలంగా ఉందని.. ఏపీలోనూ ఈ తరహా కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండు కోట్ల రూపాయలతో, 20ఎకరాలు ఇస్తే అందులో బటర్ ఫ్లై పార్కు, ప్రదర్శనశాల నిర్మిస్తామని ఖైలాష్ చంద్ర తెలిపారు.
అమరావతిలో తూర్పు ప్రాంత ఘాట్ నిర్మాణానికి భూమి పూజ - zoological ghat bhumi puja
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అమరావతిలో నిర్మించనున్న తూర్పు ప్రాంత ఘాట్ నిర్మాణానికి ఆ శాఖ సంచాలకులు ఖైలాష్ చంద్ర భూమి పూజ చేశారు. కొవిడ్ కారణంగా కొద్ది మందితో మాత్రమే ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అమరావతిలో తూర్పు ప్రాంత ఘాట్ నిర్మాణానికి భూమి పూజ