Dokka Manikya Varaprasad: తాడికొండ నియోజకవర్గానికి వైకాపా అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమించటాన్ని పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్వాగతించారు. పార్టీ అదిష్ఠాన నిర్ణయమే తమకు శిరోధార్యమని చెప్పారు. తాడికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో సమావేశం ఏర్పాటు చేసిన నేతలు.. గత ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసిన ఉండవల్లి శ్రీదేవిని ఎమ్మెల్యేగా గెలిపించామని చెప్పారు. అలాగే గతంలో ఈ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా సేవలందించిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించినందున ఆయనకు సహకరిస్తామని చెప్పారు.
తాడికొండ నియోజవర్గంలో రెండుగా చీలిన వైకాపా పార్టీ - Dokka Manikya Varaprasad
Tadikonda గుంటూరు జిల్లా తాడికొండ వైకాపా అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమించటంతో నియోజకర్గంలో పార్టీ రెండుగా చీలింది. ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు ఆయన నియమికాన్ని వ్యతిరేకిస్తుండగా మరికొందరు సమర్థిస్తున్నారు.
MLA Sridevi followers unhappy: మరోవైపు డొక్కా మాణిక్య వరప్రసాద్ నియామకంపై ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాడికొండ అడ్డరోడ్డు వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె అనుచరులు.. ఎమ్మెల్యే ఉండగా మరో సమన్వయకర్త ఎందుకని ప్రశ్నించారు. తెదేపా నుంచి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తమకు సమన్వయకర్త కాదని అన్నారు. గతంలోనూ నలుగురు సమన్వయకర్తలను పెట్టారని దాని వల్ల పార్టీ నష్టపోయిందని గుర్తు చేశారు. సమన్వయకర్త వల్ల పార్టీకి వచ్చిన లాభమేమీ లేదని అన్నారు. దీని వల్ల ఎమ్మెల్యేకు ఒక వర్గం, సమన్వయకర్తకు మరొక వర్గం తయారవుతుందని చెప్పారు. ఫిరంగిపురంలోని పార్టీ కార్యాలయంలోనూ సమావేశమైన శ్రీదేవి అనుకూల వర్గం నేతలు తమను సంప్రదించకుండా అదనపు సమన్వయ కర్తను నియమించటం సరైంది కాదన్నారు. దీనివల్ల క్యాడర్ దెబ్బతింటుందన్నారు. పార్టీ పరంగా తమకు ఏదైనా పని ఉంటే ఎమ్మెల్యే శ్రీదేవి దగ్గరికి వెళ్లాలా ? ఇంచార్జ్ వద్దకు వెళ్లాలా అని ప్రశ్నించారు.
ఇవీ చూడండి