గుంటూరు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిలో... వైకాపా రెబల్ నాయకుడు కోటిరెడ్డిపై ప్రత్యర్థి వర్గం దాడికి పాల్పడింది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా కోటిరెడ్డి నామినేషన్ వేశారు. వైకాపాలోని మరో వర్గం కోటిరెడ్డిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చింది.
కోటిరెడ్డి అందుకు అంగీకరించలేదని మరో వర్గం అతనిపై దాడికి పాల్పడడంతో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. చికిత్సకోసం అతడిని వెంటనే పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలించారు. దాడికి నిరసనగా పాల్వాయి జంక్షన్లో అతని అనుచరుల రాస్తారోకోకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఉదాసీనంగా ఉండటం వల్లే దాడి జరిగిందని కోటిరెడ్డి వర్గం ఆరోపిస్తోంది.