YSRCP Negligence on Cattle Welfare: ఆకలితో అంబా అని కాకుండా జగనన్నా అంటున్న మూగజీవాలు.. ఓ సారి వాటి తిప్పలు చూడన్నా..! YSRCP Negligence on Cattle Welfare: పశువులకు సమగ్ర పోషక దాణా పెట్టి.. టీకాలు వేసే పరిస్థితి ఒక్క మీ జగనన్న ప్రభుత్వంలోనే జరుగుతుందని ఈనెల 8న అంబేడ్కర్ కోనసీమ జిల్లా తోటరాముడిపేట కొండకుదురులో జరిగిన సమావేశంలో సీఎం జగన్ ఊదరగొట్టారు. అంటే 2019కి ముందు వరకు రాష్ట్రంలో ఎక్కడా పశువులకు టీకాలు వేయలేదు మరీ! మందులైనా ఇస్తున్నారో లేదో. అంతెందుకు? రాష్ట్రంలో అసలు పశువులైనా ఉన్నాయో? లేదో? వాటినీ కూడా జగనే కనిపెట్టి తెచ్చారో ఏమో. అదీ సెలవిస్తే బాగుంటుంది మన ముఖ్యమంత్రి సారూ. మరి రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలుగా పశుసంవర్థకశాఖ ఏం చేస్తోందో సెలవిస్తే అదీ విని తరిస్తామంటున్నారు పశుపోషకులు.
సహకార డెయిరీలకు పాలు పోసే పాడి రైతులకు లీటరుకు 4రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని గత ఎన్నికల్లో నమ్మబలికిన జగన్.. గద్దెనెక్కగానే మడమ తిప్పేశారు. అదేమంటే అమూల్ ద్వారా ఎక్కువ ధరలిప్పిస్తున్నామని గొప్పలు పోతున్నారు. చివరకు మూగజీవాలకిచ్చే దాణానూ సైతం దూరం చేశారు. గోకులం పథకానికీ, మంగళం పాడేశారు. పశు నష్ట పరిహార స్కీమ్‌ను ఎత్తేసి.. పశువుల బీమా పథకం తీసుకొనివచ్చి రైతుపై భారం మోపారు. దీనికీ బడ్జెట్ లేదంటూ అర్ధాంతరంగా విరామం పలికారు. బీమా చేసిన వాటికి బాండ్లు ఇవ్వలేదు. పరిహారం లేదు. సమీకృత దాణా ఇస్తున్నా దాని నాణ్యత సరిగా లేదంటూ రైతులు ఆసక్తి చూపడం లేదు.
Lift irrigation: నిరుపయోగంగా ఎత్తిపోతల పథకాలు..సాగునీరు అందక రైతుల అవస్థలు
పశు సంక్షేమానికి గత ప్రభుత్వంలో బడ్జెట్లో ఎక్కువగా కేటాయించి ఖర్చు చేశారు. ప్రత్యేకించి మేత విధానం తీసుకొనివచ్చి దాణా, సమీకృత దాణా, మాగుడు గడ్డిని రైతులకు సరఫరా చేశారు. ఏడాదికి 850 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. వైసీపీ వచ్చాక 2019-20 నుంచి ఏడాదికి 750 కోట్ల రూపాయల నుంచి 800 కోట్ల రూపాయలే ఖర్చు చూపెడుతున్నారు. కేటాయింపులు మాత్రం 1,000 కోట్ల రూపాయల నుంచి 1,115 కోట్ల రూపాయల వరకు ఉంటున్నాయి. 2019–20 సంవత్సరానికి ముందు ఏ గ్రామానికి వెళ్లినా.. మూటల కొద్దీ మొక్కజొన్న మాగుడు గడ్డి కన్పించేది. కిలో 2 రూపాయల చొప్పున రాయితీపై ఇవ్వడంతో లారీల కొద్దీ సరఫరా అయిన పరిస్థితులున్నాయి.
వైసీపీ వచ్చాక నిలిపేసింది. 2018-19లో 87 కోట్ల రూపాయలతో 1.32 లక్షల టన్నులు, 2019-20లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు 18 కోట్ల రూపాయలతో 23 వేల టన్నుల మాగుడు గడ్డిని అందించారు. పశుగ్రాస విధానం ద్వారా గత ప్రభుత్వ హయాంలో కిలో 4 రూపాయల 25పైసల చొప్పున దాణా, 8రూపాయల 50పైసల చొప్పున సమీకృత దాణా సరఫరా చేశారు. ఇతర రాష్ట్రాలకు కూడా ఇది ఆదర్శంగా నిలిచింది. వైసీపీ అధికారంలోకొచ్చాక వీటిని నిలిపేసింది. టీఎంఆర్ మాత్రమే కొనసాగిస్తున్నా.. నాణ్యంగా లేదన్న ఫిర్యాదులొస్తున్నాయి.
How CM Jagan Cheating AP People: పథకాల్లో 'కోతలు'.. ప్రసంగాల్లో 'కోతలు'.. పెత్తందారు 'ఎవరు' జగన్?..
2018-19లో 44 కోట్ల రూపాయల విలువైన 45 వేల టన్నుల టీఎంఆర్, 2019-20లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎనిమిదిన్నర కోట్ల రూపాయల విలువైన 9,182 టన్నులు సరఫరా చేశారు. 2018-19 ఏప్రిల్ నుంచి 2019-20 జూన్ వరకు 52 కోట్ల రూపాయల విలువైన 66 వేల టన్నుల కాన్సంట్రేట్ ఫీడ్ రైతులకు అందించారు. గతంలో పశుగ్రాస క్షేత్రాలు, మెగా పశుగ్రాస క్షేత్రాలకు పెద్దపీట వేశారు. గ్రామంలో కనీసం రెండెకరాల్లో రైతులే గడ్డి పెంచుకునేలా ప్రోత్సహించారు. వైసీపీ వచ్చాక ఈ పద్దతికి మంగళం పాడింది. పశుగ్రాస విత్తన సరఫరా కూడా మందగించింది. గతంలో సంవత్సరానికి 3 వేల 290 టన్నుల వరకు పంపిణీ చేయగా.. నాలుగేళ్లుగా ఏడాదికి 2 వేల టన్నులకు మించడం లేదు.
గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు తమ పశువులను రోడ్లపైన కట్టేస్తుంటారు. అవి ఎండా వానల్లోనే నిత్యం ఉండి ఆరోగ్యం దెబ్బతినడంతో పాల ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. దీంతో టీడీపీ హయాంలో గోకులం, మినీ గోకులం పథకాల కింద ఉపాధిహామీ పథకం ద్వారా షెడ్ల నిర్మాణానికి రాయితీ ఇచ్చారు. సుమారు 60 వేలమందికి పైగా షెడ్లు నిర్మించుకున్నారు. వైసీపీ వచ్చాక పథకాన్ని నిలిపేసింది. రైతులకు బిల్లులివ్వకపోవటంతో న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. కొందరికి మాత్రం అరకొర నిధులు విడుదల చేసి చేతులు దులుపుకుంది.
Uttarandhra Sujala Sravanthi Project: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపై ఇచ్చిన హామీ గుర్తుందా జగన్?