గుంటూరు జిల్లా తాడేపల్లి వైకాపా కేంద్ర కార్యాలయంలో శాసనసభ్యులు కొలుసు పార్థసారథి మాట్లాడారు. తెదేపా నాయకులు విడుదల చేసిన చార్జిషీట్లో తన పేరు అనవసరంగా ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఆధారాలతో ఆరోపణలు రుజువు చేయలేకపోతే గురువారం విజయవాడ ధర్నాచౌక్లో చంద్రబాబు చేసే దీక్షలో.. తాను కూడా తెదేపాకు వ్యతిరేకంగా ధర్నా చేస్తానని హెచ్చరించారు. ధర్నా కోసం పోలీసుల అనుమతి కోరినట్టు చెప్పారు.
''రుజువు చేయండి.. లేదంటే బాబు దీక్షలో ధర్నా చేస్తా'' - latest news of kolusu pardhasaradhi
''తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన చార్జ్ షీట్లో అనవసరంగా నా పేరును ప్రస్తావించారు.ఈ పరిణామంపై న్యాయపోరాటం చేస్తా'' అని వైకాపా శాసనసభ్యులు పార్థసారథి గుంటూరులో చెప్పారు.
![''రుజువు చేయండి.. లేదంటే బాబు దీక్షలో ధర్నా చేస్తా''](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5054839-42-5054839-1573660192875.jpg)
సమావేశంలో మాట్లాడుతున్న కొలుసు పార్థసారథి