ఇసుక విధానంపై గుంటూరులో జరిగిన సమీక్షా సమావేశంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన వ్యాఖ్యలు ధుమారం రేపాయి. గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన బొల్లా బ్రహ్మనాయుడు... ఇసుక రీచ్ నుంచి యార్డుకు వెళ్లే లోపే లారీలకు లారీలు మాయమైపోతున్నాయని ఆరోపించారు. తమ నియోజకవర్గంలో గుప్పెడు ఇసుక దొరకటం గగనమైపోయిందన్నారు. తమ నియోజకవర్గంలో ప్రజలు ఇసుక గురించే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నట్లు గోడు వెళ్లబోసుకున్నారు.
'ఇసుక రీచ్ నుంచి యార్డుకు వెళ్లే లోపే లారీలు మాయం..'
ఇసుక విధానంపై వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి ముందే .. 'ఇసుక రీచ్ నుంచి యార్డుకు వెళ్లే లోపే లారీలకు లారీలు మాయమైపోతున్నాయి..' అంటూ ఆరోపించారు.
ఇసుక విధానంపై వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రాహ్మనాయుడు