తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే వైకాపాపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వైకాపా శాసనసభ్యుడు అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది తామే చేశామని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కంటి వెలుగు పథకంలో 67 లక్షల మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. పసలేని విమర్శలకు సీఎం జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
'చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు' - ycp mla chandrababu naidu criticised to chandrababu
తెదేపా అనవసర ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వైకాపా శాసనసభ్యుడు అంబటి రాంబాబు విమర్శించారు. తాము ఏ పథకం ప్రవేశపెట్టినా అది తెదేపాయే ప్రవేశపెట్టిందేనని చెప్పుకోవడం సరికాదని హితవు పలికారు.
!['చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4712368-thumbnail-3x2-ambgupta.jpg)
అంబటి రాంబాబు
TAGGED:
ycp leader ambati rambabu