Lokesh Yuvagalam: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైఎస్సార్సీపీ మంత్రులు విమర్శలు గుప్పించారు. ఎలాంటి సెంటిమెంట్ లేని నారా లోకేశ్... కేవలం అధికారం కోసం మాత్రమే పాదయాత్ర చేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. ఏ విషయంలోనూ స్పష్టత లేకుండా పాదయాత్ర చేస్తున్న నేతగా లోకేశ్ చరిత్రలో నిలిచిపోతారని మంత్రి విడదల రజని ఎద్దేవా చేశారు.
టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పోలీసులపై చేసిన వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కుప్పం సభలో అచ్చెన్నాయుడు మాట్లాడిన తీరు సరికాదన్న అంబటి.... నారా లోకేష్ యువగళం పాదయాత్రలో చిత్తశుద్ది లేదని ఆరోపించారు. టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు.
"నాన్నకే సెంటిమెంట్స్ లేవంటే కొడుక్కి అంతకన్నా లేవు. వాళ్లకు కేవలం డబ్బులు, అధికారం వాళ్లు బాగుంటే చాలు అనుకునేది మనకు స్పష్టంగా మరోసారి నిన్న కూడా కనిపించింది. నిన్న పాదయాత్ర స్టార్ట్ అవ్వగానే తారక రత్నకి సీరియస్‌గా హార్టస్టోక్ వచ్చి పడపోతే కనీసం సెంటిమెంట్ లేకుండా పాదయాత్ర చేసుకుంటూ తరువాత పబ్లిక్ మీటింగ్‌లో అధికార పక్షం వాళ్లని ముఖ్యంగా నన్ను మహిళని తిట్టి ఆనంద పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని మాట్లాడే అర్హత ఏ కోణంలో లోకేష్‌కు లేదు." - మంత్రి రోజా