పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసేవారికి బెదిరింపులు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమని పంచాయతీలో 6వ వార్డులో పోటీచేస్తున్న గోళ్ల శ్రీనివాసరావు ఇంటికి వైకాపా నేత వీరయ్య తన అనుచరులతో వెళ్లి.. నామినేషన్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ ప్రలోభపెట్టాడు. జిల్లాలో తాను ఏం అనుకుంటే అది జరుగుతుందని.. హోంమంత్రి తన బంధువేనని అన్నాడు. జిల్లా కలెక్టర్ పోస్టు కూడా తానే వేయించానని చెప్పుకోవడం విశేషం.
'నామినేషన్ వెనక్కి తీసుకుంటే.. ఈమని రూపురేఖలు మారుస్తా..'
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమని పంచాయతీలో 6వ వార్డులో పోటీచేస్తున్న గోళ్ల శ్రీనివాసరావును వైకాపా వ్యక్తులు నామినేషన్ వెనక్కుతీసుకోవాలని బెదిరించారు. నామినేషన్ వెనక్కు తీసుకుంటే ఈమని రూపురేఖలు మారుస్తామని అన్నారు.
ysrcp members threaten tdp leaders at guntur district to withdraw nominations