గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని.. కులం పేరుతో దూషించిన వ్యక్తులను వెంటనే అరెస్డు చేయాలంటూ వైకాపా నేతలు ధర్నా చేశారు. తుళ్లూరు బస్టాండ్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు వైకాపా నేతలు, దళిత సంఘాలు ర్యాలీ చేపట్టారు. శాసనసభ్యురాలిని కులం పేరుతో దూషించిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించిన ఇద్దరు వ్యక్తులు శివయ్య, సాయిలను పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి బాలుడు కావడం వల్ల అతన్ని జువైనల్ కోర్టుకు తరలించారు.
ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించిన వ్యక్తుల అరెస్టు - దళిత సంఘాలు ర్యాలీ
కులం పేరుతో ఎమ్మెల్యేను దూషించిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని వైకాపా కార్యకర్తులు ధర్నా నిర్వహించారు. అప్పటికే కేసునమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ysrcp leaders protests at thulluru at guntur district