ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్సీపీ నేతల కనుసన్నల్లో భూకబ్జాలు - మౌనముద్ర వహించిన అధికారులు - వైసీపీ నేతల భూ కబ్జాలు

YSRCP Leaders Government Land Grabbing: ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేయడం, ప్రభుత్వ స్థలాలను గుట్టుచప్పుడు కాకుండా వాటాలు వేసుకుని పంచేసుకోవడం, అధికారంలోని ఉండగానే అందినకాడికి దోచుకోవడం ఇదే లక్ష్యంతో వైఎస్సార్సీపీ నేతలు దోపిడీకి తెగబడుతున్నారు. పిల్లలు ఆడుకునే పార్కులు అత్యంత విలువైన కూడలిలోని స్థలాలు, బళ్లూ, గుళ్లూ కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లు ఆక్రమించేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులను బెదిరించి దొంగపత్రాలు సృష్టిస్తున్నారు. ప్రశ్నించి వారిపై దాడులకు తెగబడి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

YSRCP_Leaders_Government_Land_Grabbing
YSRCP_Leaders_Government_Land_Grabbing

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 7, 2024, 10:41 AM IST

వైఎస్సార్సీపీ నేతల కనుసన్నల్లో భూకబ్జాలు - మౌన ముద్ర వహించిన అధికారులు

YSRCP Leaders Government Land Grabbing :పారదర్శక పాలన ముఖ్యమంత్రి జగన్ నోటివెంట తరుచూ వచ్చే ఊతపదమిది. ప్రభుత్వంలో ఉన్న మనమే నిబంధనలు అతిక్రమిస్తే రేప్పొద్దున ఇలా చేయొద్దని చెప్పే నైతికత మనకుంటుందా? మనం రోల్ మోడల్‌గా ఉండాలి కదా అంటూ కలెక్టర్లతో నిర్వహించిన తొలి సమావేశంలో జగన్ చెప్పిన మాటలివి. చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని ప్రజా వేదిక భవనం నుంచే ఇది మొదలవ్వాలంటూ ఆయన మహా గొప్పగా చెప్పారు. కానీ ఇవేమీ అటు అధికారులు గానీ, అధికారపార్టీ నాయకులు గానీ చెవికెక్కించుకున్నట్లు లేరు. నాలుగున్నరేళ్లుగా యథేచ్ఛగా పుర, నగరపాలికల్లో వైఎస్సార్సీపీ నేతల అండదండలతో కబ్జాలకు పాల్పడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా కోట్ల రూపాయల విలువైన స్థలాలు అధికార పార్టీ నేతల పరమవుతున్నాయి.

YSRCP Leaders Land Kabza :నెల్లూరులోని చైతన్యపురి కాలనీలో 12 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని 6 నెలల క్రితం అధికార వైఎస్సార్సీపీ నేతలు ఆక్రమించేందుకు యత్నించారు. స్థలానికి తప్పుడు పత్రాలు సృష్టించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Minister Peddireddy Ramachandra Reddy) మనుషులమంటూ హల్‌చల్ చేశారు. ఆక్రమణదారులను కాలనీ వాసులు అడ్డుకున్నారు. అధికారులకు ఫిర్యాదు చేయడంతో నగరపాలక సంస్థ కమిషనర్ స్వయంగా వచ్చి స్థలాన్ని పరిశీలించారు. అధికారుల విచారణలో పార్కు స్థలానికి తప్పుడు దస్తావేజులు సృష్టించినట్లు బయటపడింది. కాలనీవాసులు అడ్డుకోకుండా ఉండి ఉంటే ఎంతో విలువైన స్థలం వైఎస్సార్సీపీ నేతల ఖాతాలో చేరిపోయేది. ఇప్పటికీ ఆ పార్కు స్థలాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.

వైఎస్సార్​సీపీ నేతల భూదాహం, ఖాళీ జాగాపై కన్నుపడిందంటే అంతే!

అనుమతులు ప్రజలకీ, ప్రతిపక్షాలకి మాత్రమే : గుంటూరులో నగరపాలక సంస్థకు చెందిన విలువైన స్థలాన్ని ఆక్రమించి అందులో వైఎస్సార్సీపీ కార్యాలయ భవన నిర్మాణానికి అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు శ్రీకారం చుట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు చేపట్టినా అధికారుల పట్టించుకోలేదు. స్థానికులు హై కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. మళ్లీ ఇప్పుడు మరోసారి పనులు పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అధికారుల మౌన ముద్ర : మచిలీపట్నంలో ప్రధాన రహదారులకు ఇరువైపులా నగరపాలక సంస్థకు చెందిన స్థలాలను వైఎస్సార్సీపీ నేతలు ఆక్రమించారు. వాటిల్లో దుకాణాలు ఏర్పాటు చేసి అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యమైన కూడళ్లలోని స్థలాల ఆక్రమణ కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నా నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు.

  • ప్రకాశం జిల్లా కనిగిరిలో వైఎస్సార్సీపీ నేతకు చెందిన స్థలం పక్కనే ఉన్నప్రభుత్వ భూమిని ఆక్రమించేశారు. స్థానికుల ఫిర్యాదుతో విచారణ జరిపి ప్రభుత్వ భూమిగా తేల్చిన అధికారులు అక్కడ బోర్డు సైతం ఏర్పాటు చేశారు. అయినా సరే అధికార పార్టీ నేత యథేచ్ఛగా ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలకు సిద్ధమవుతున్నారు.
  • తిరుపతి జిల్లా మేనకూరు ప్రత్యేక ఆర్థిక మండలి భూములను సైతం వదిలిపెట్టడం లేదు. విలువైన స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి అద్దెలకు ఇస్తున్నారు. దీనిపై స్థానికుల నుంచి అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా తూతూమంత్రపు చర్యలతో చేతులు దులిపేసుకుంటున్నారు.
  • నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఆక్రమించిన వైఎస్సార్సీపీ నేత భవన నిర్మాణం చేపట్టారు. పాఠశాల స్థలంలో వంట, పడక గదులు, మెట్లు, టాయిలెట్లు నిర్మించినా అధికారులు కన్నెత్తి చూడటం లేదు.
  • గుంటూరు లాలాపేటలో ఓ భవనానికి ఒకే అంతస్తుకు అనుమతి తీసుకుని ఏకంగా నాలుగు అంతస్తులు నిర్మించారు. అధికార పార్టీ కార్పొరేటర్‌కు చెందిన వారి భవనం కావడంతో అధికారులు మిన్నకుండిపోయారు.
  • అనంతపురంలో మూడు అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకున్న ఒకరు ఏకంగా ఆరు అంతస్తుల్లో పనులు చేపట్టారు. పార్కింగ్, భవనం చుట్టూ సెట్ బ్యాక్ విడిచి పెట్టే విషయంలో నిబంధనలను ఉల్లంఘించినా అధికార పార్టీకి చెందిన నేత భవనం కావడంతో అదికారులు పట్టించుకోలేదు.
  • విజయవాడ నగర పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
  • విశాఖలో కొత్త భవన నిర్మాణాలు కార్పొరేటర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అన్నీ అనుమతులు ఉన్నా కార్పొరేటర్లకు కప్పం కట్టాల్సిందే.

ఖాళీ స్థలం కనిపిస్తే చాలు పాగా వేస్తున్న వైసీపీ నాయకులు- ఏకంగా కార్యకర్త భూమినే కబ్జా

ముఖ్యంగా అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే అక్రమ దందా సాగుతోంది. ఆ పార్టీ కార్పొరేటర్లే అందినకాడికి దండుకుని కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు వైఎస్సార్సీపీ నేతలకు దాసోహమయ్యారు. కళ్లెదుటే అక్రమ నిర్మాణాలు కనిపిస్తున్నా కన్నెత్తి చూడటం లేదు. స్థానికుల నుంచి వచ్చే ఫిర్యాదులనూ పట్టించుకోవడం లేదు.

గుంటూరు, విజయవాడ, విశాఖ, తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు నగర పాలక సంస్థల్లో పట్టణ ప్రణాళిక విభాగంలోని కీలక స్థానాల్లో ఉన్న వారంతా మంత్రులు, ఎమ్మెల్యేలు కోరి తెచ్చుకున్నవారే. దీంతో ప్రజాప్రతినిధుల మాటే వీరికి శిరోధార్యం అవుతోంది. విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు పట్టణ ప్రణాళిక విభాగాల్లో చెప్పినట్లుగా వినని ద్వితీయ శ్రేణి అధికారులను గత రెండేళ్లలో అనేకసార్లు బదిలీ చేయించారు. ఇక వార్డు సచివాలయాల్లోని పట్టణ ప్రణాళిక కార్యదర్శులు కార్పొరేటర్లు చెప్పినట్లు వినాల్సిందే. లేదంటే బెదిరింపులు, భౌతిక దాడులకు గురి కావాల్సిందే.

ఒంగోలులో కొనసాగుతున్న భూకబ్జాలు - నకిలీ స్టాంపులు, అక్రమ రిజిస్ట్రేషన్లతో మోసాలు

ABOUT THE AUTHOR

...view details