విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయటాన్ని నిరసిస్తూ.. గుంటూరులో వైకాపా నేతలు, దళిత సంఘాల నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. తొలుత అమరావతి రోడ్డులోని అమృతరావు విగ్రహానికి ఎమ్మెల్సీ డొక్కా మణిక్యవరప్రసాద్, అమృతరావు కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు నేతలు.. పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమృతరావు విగ్రహం నుంచి లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన - గుంటూరులో వైకాపా నేతల నిరసన ర్యాలీ
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో వైకాపా నేతలు, దళిత సంఘాల నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు, దళిత సంఘాల నిరసన
ఎంతోమందికి జీవనోపాధి కల్పించిన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం దారుణమని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను కేంద్రప్రభుత్వం అమ్ముకుంటూ పోవడం బాధాకరమన్నారు. తక్షణమే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ..మంత్రి కొడాలి నానిపై కేసు నమోదుకు ఎస్‌ఈసీ ఆదేశం