లాక్డౌన్ కారణంగా ముఖ్యమంత్రి సహాయనిధికి వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు రూ.50 వేలు విరాళంగా అందజేశారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పిరంగిపురానికి చెందిన వడ్లమూడి నాగేముద్రం 30వేలు, వజ్రాల అయ్యప్పరెడ్డి 10వేలు, దాచేపల్లి నరేంద్రకుమార్ 10వేలు మొత్తంగా 50 విలువగల చెక్కును తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవికి గుంటూరులోని ఆమె పార్టీ కార్యాలయంలో దాతలు అందజేశారు.
సీఎం సహాయ నిధికి వైకాపా అభిమానుల విరాళం - ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాజా వార్తలు
లాక్డౌన్ వేళ దాతలు దాతృత్వాన్ని చాటుతున్నారు. కరోనాపై పోరాటంలో మొము సైతం అంటూ సీఎం సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరుకు చెందిన వైకాపా అభిమానులు 50 వేల రూపాయలను తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అందజేసారు.
![సీఎం సహాయ నిధికి వైకాపా అభిమానుల విరాళం donation to cm relief fund](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7297433-705-7297433-1590112123035.jpg)
వైకాపా అభిమానులు సీఎం సహాయ నిధికి విరాళం