గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులకు బెదిరింపులు, ఒత్తిళ్లు వచ్చిపడుతున్నాయి. దాసుపాలెం గ్రామంలో తెదేపా మద్దతుదారుడు భిక్షాలురావు అనే రైతు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని వైకాపా నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. నామినేషన్ ఉపసంహరించుకునే వరకు.. దాసుపాలెం రైతులు గుంటూరు కృష్ణనగర్‌లోని రైతుబజార్లో కూరగాయలు అమ్ముకోవడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. గత నాలుగు రోజులుగా దాసుపాలెం రైతులు.. రైతు బజార్ బయట కూరగాయలు అమ్ముకుంటున్నారు.
నామినేషన్ ఉపసంహరణకు 'నో'... రైతు బజారులోకి 'నో ఎంట్రీ' - ప్రత్తిపాడు పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బెదిరింపులు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం దాసుపాలెం గ్రామంలో నామినేషన్ ఉపసంహరించుకోవాలని తెదేపా మద్దతుదారున్ని వైకాపా నేతలు బెదిరిస్తున్నారు. గుంటూరు కృష్ణనగర్‌లోని రైతు బజార్లో కూరగాయలు అమ్ముకోవడానికి వీల్లేదని హూకుం జారీ చేశారు.
prathipadu panchayth elections
పార్టీల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని దాసుపాలెం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు రైతు బజార్లో స్థానం కల్పించాలని వేడుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:కొడాలి నానికి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు