ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Soil Tests Stopped in AP: అంతా జగన్నాటకం.. చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి - AP farmers problems

YSRCP Governmnet Stopped Micronutrients Distribution: రైతు ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకుంటున్న జగన్‌ సర్కార్‌.. అన్నదాతలకు మేలు జరిగే అన్ని పథకాలకు మంగళం పాడేసింది. రైతుల పెట్టుబడులను తగ్గించి.. ఉత్పత్తి పెంచడంలో ఎంతో సాయపడే సూక్ష్మపోషకాల పంపిణీని పూర్తిగా ఎత్తివేసింది. భూసార పరీక్షలను నిలిపివేసింది. రైతులపై ప్రేమ ఒలకబోస్తూ ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు..

soil
soil

By

Published : Jun 29, 2023, 8:32 AM IST

అంతా జగన్నాటకం.. చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి

YSRCP Governmnet Stopped Micronutrients Distribution: అన్నదాతల అభ్యున్నతికి పాటుపడే ప్రభుత్వం తమది అంటూ ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. భూసార పరీక్షల నుంచి ఇతర అన్ని అంశాల్లోనూ రైతులకు దన్నుగా నిలవాల్సిన ప్రభుత్వం.. ఈ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది. భూసార పరీక్షలతో పాటు సూక్ష్మ పోషకాల ఉచిత పంపిణీకి కూడా.. జగన్‌ ప్రభుత్వం మంగళం పాడింది. నేలల్లో పోషకాల లోపాన్ని నివారించి నాణ్యమైన పంట దిగుబడులు వచ్చేలా రైతులకు తోడ్పడేందుకు ఏడాదికి కనీసం 80 కోట్లు కూడా ఇవ్వలేమంటూ చేలెత్తేసింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఇచ్చి సొమ్మును కూడా లెక్కగట్టి తాము అధికారంలోకి వచ్చాక రైతులకు లక్షా 60వేల కోట్ల సాయం చేశామంటూ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కానీ రైతు అవసరాలు తీర్చడం మాత్రం మరిచిపోయింది.

భూసార పరీక్షల ద్వారా నేలలో ఉన్న పోషకాల లోపం తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా సూక్ష్మ పోషకాలను అందిస్తే నాణ్యమైన పంట దిగుబడులు వస్తాయి. పంట ఉత్పత్తి కూడా పెరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కువ శాతం నేలల్లో పోషకాల లోపం ఉందని గతంలో నిర్వహించిన భూసార పరీక్షల్లో తేటతెల్లమైంది. 35 నుంచి 40శాతం నేలల్లో జింకు, 24 శాతం నేలల్లో ఇనుము, 5 శాతం భూముల్లో మాంగనీసు, 5 శాతం నేలల్లో కాపర్‌, 20శాతం పొలాల్లో బొరాన్‌, 18నుంచి 22శాతం నేలల్లో సల్ఫర్‌ లోపం ఉందని భూసార పరీక్షల్లో గుర్తించారు. గతంలో భూసార పరీక్షలు నిర్వహించి జిప్సం పంపిణీ చేయడం ద్వారా వేరుసెనగ ఉత్పత్తి ఎకరాకు రెండున్నర నుంచి మూడున్నర క్వింటాళ్ల వరకు పెరిగింది. వరి, కంది, పొద్దుతిరుగుడులోనూ దిగుబడులు పెరిగాయని గతంలో వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా పనిచేసిన ధనుంజయరెడ్డి కేంద్రానికి నివేదించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా 4 ఏళ్లుగా పనిచేస్తున్న ధనుంజయ్‌రెడ్డి ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి నిలిపేలా కనీస చర్యలు చేపట్టలేదు.

తెలుగుదేశం హయాంలో వందశాతం రాయితీపై రైతులకు సూక్ష్మ పోషకాలను అందజేశారు. 2014-15 నుంచి మూడేళ్ల పాటు 50శాతం రాయితీపై అందించగా...2017-18 నుంచి ఉచితంగా అందజేశారు. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గాయి. అధిక దిగుబడులు లభించాయని నివేదికలు వెల్లడించాయి. సగటున ఒక్కో రైతుకు 2 వేల నుంచి 3 వేల రూపాయల వరకు ప్రయోజనం కలిగింది. చౌడు నేలల పునరుద్ధరణకు రైతులకు హెక్టారుకు 10 వేల నుంచి 17 వేల వరకు ఖర్చు కాగా భూసార పరీక్ష కార్డుల ఆధారంగా ఈ మొత్తాన్ని తెదేపా ప్రభుత్వం ఉచితంగా అందించింది. మొత్తంగా అయిదేళ్లలో సూక్ష్మ పోషకాల పంపిణీకి సుమారు 400 కోట్లకు పైగా ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే 2019-20లో సూక్ష్మ పోషకాల రాయితీని సగానికి తగ్గించారు. 2018-19లో మిగిలిన నిల్వలను మాత్రమే అందించారు. మొత్తం 21 వేల టన్నుల పంపిణీకి 8 కోట్ల రాయితీ మాత్రమే ఇచ్చారు. మరుసటి ఏడాది నుంచి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది.

ABOUT THE AUTHOR

...view details