YSRCP Government Negligence in Nadu Nedu Works: నాడు-నేడు పనులతో బడుల రూపురేఖలు మార్చేశామని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి జగన్‌కి(AP CM Jagan Mohan Reddy).. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. ఆ డొల్లతనమేంటో తెలుస్తుంది. మొదటి విడత పనులు పూర్తి చేసి, రెండు సంవత్సరాలు గడవక ముందే.. పాఠశాలల్లో సమస్యలు పునరావృతమవుతున్నాయి. చాలా బడుల్లో టైల్స్‌తో వేసిన ఫ్లోరింగ్ కుంగిపోయింది. ఏడు సంవత్సరాల పాటు ఉంటాయని వేసిన రంగులు వెలిసిపోయాయి. ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. మరమ్మతులు చేసిన శ్లాబు పెచ్చులు ఊడిపోతున్నాయి. కొన్ని చోట్ల మరుగుదొడ్ల పనులు పూర్తి చేయకపోవడం.., నీటి సదుపాయం లేకపోవడంతో... నిరుపయోగంగా మారాయి.
Negligence in Nadu Nedu Works in AP: పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పచ్చటి లాన్ కనుమరుగైపోయింది. గత సంవత్సరం 852 కోట్ల 39 లక్షలు, ఈ ఏడాది 879 కోట్ల 28 లక్షల రూపాయలను.. అమ్మఒడి లబ్ధిదారుల నుంచి వెనక్కి తీసుకున్నారు. కేవలం ఆయాలు, నైట్ వాచ్‌మెన్‌ల జీతాలు, మరుగుదొడ్ల క్లీనింగ్‌కు రసాయనాల సరఫరాకు మాత్రమే ఈ నిధులు వినియోగిస్తున్నారు. నల్లాలు చెడిపోయినా.. రన్నింగ్ వాటర్ సమస్య వచ్చినా.. ఫ్లోరింగ్ కుంగిపోయినా.., టైల్స్ పగిలినా పట్టించుకోవడం లేదు. పాఠశాలల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 15 వేల 715 పాఠశాలల్లో 3 వేల 669 కోట్ల రూపాయలతో పనులు పూర్తిచేశారు. 2019 నవంబర్ 14న ప్రారంభమై పనులు 2021 ఆగస్టు 16 నాటికి పూర్తయ్యాయి.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందంపూడి ఎంపీపీ పాఠశాలలో టైల్స్‌తో వేసిన ఫ్లోరింగ్ కుంగిపోయింది. మరుగుదొడ్లకు వేసిన తలుపులు ఊడిపోయాయి. గోడలపై వేసిన చిత్రాల రంగులు వెలిసిపోయాయి. ఈ రంగులపై మరోసారి కొత్తగా వేసిన రంగులూ వెలిసిపోయాయి. హైస్పీడ్‌తో తిరుగుతాయని ఏర్పాటు చేసిన ఫ్యాన్లు సక్రమంగా తిరగడం లేదు. పి.గన్నవరం మండలం లంకల గన్నవరం ప్రాథమిక పాఠశాల భవనాన్ని.. నాడు-నేడు పనుల పేరుతో గత ఏడాది తొలగించారు.
YCP Leaders Irregularities in Nadu Nedu: కొత్త భవనం నిర్మించేందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో 53 లక్షల రూపాయలు కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ కేవలం 13 లక్షల 50 వేలు మాత్రమే మంజూరు చేయడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాఠశాల భవనం తొలగించడంతో.. ఇక్కడి 44 మంది విద్యార్థులను స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చిన్నపాటి షెడ్డులోనే పాఠశాలను నడుపుతున్నారు. త్వరగా పాఠశాల నిర్మాణం పూర్తిచేయాలని కోరుతున్నారు.
గన్నవరం నియోజకవర్గంలోని అరుంధతిపేట, ఎల్లమెల్లివారిపేట, కారుపల్లిపాడు పాఠశాలల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ పాఠశాలలకు చెందిన 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో.. ఒక్కో బడిలో ఇద్దరు, ముగ్గురు చొప్పునే విద్యార్థులు మిగిలారు. వారితోనే ఉపాధ్యాయులు నెట్టుకొస్తున్నారు.
Nadu-Nedu: 'వైసీపీ ప్రభుత్వ ప్రచారాల కోసమే నాడు-నేడు'.. పాఠశాలలు ప్రారంభమైనా.. పూర్తికాని పనులు
Nadu Nedu Works Slowly in Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మెరకచించ పంచాయతీ దిగ-గసరాపల్లిలో 35 ఏళ్ల కిందట నిర్మించిన గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. 15 ఏళ్ల కిందట మరో భవనం శ్లాబ్ స్థాయికి నిర్మించారు. బయట, లోపల బ్లాక్ బోర్డులు నిర్మించారు. గచ్చులు, కిటికీలు, రంగులు మరిచారు. దీంతో పాఠశాల భవనం కాస్తా పశువుల పాకగా మారింది. ప్రహరీ పనులు మధ్యలో నిలిచిపోయాయి. పెద్ద గేటు వృథాగా పడి ఉంది. లక్షలాది రూపాయలు నాడు-నేడు పనుల్లో వెచ్చించే బదులు.. ఈ అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Students fire on NADU-NEDU: ప్రారంభమైన సర్కారీ బడులు..నత్తనడకన నాడు-నేడు పనులు..