ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు బజార్లు కావవి - ఆదాయమే హద్దు.. సౌకర్యాలువద్దు! - రైతు బజార్లలో మరుగుదొడ్ల సౌకర్యం

YSRCP Government Neglecting Rythu Bazars in Andhra: వైఎస్సార్​సీపీ పాలనలో రైతుబజార్లు అధ్వానంగా తయారయ్యాయి. అటు అన్నదాతలు, ఇటు కొనుగోలుదారులకు ప్రయోజనకరంగా ఉండేలా ఏర్పాటు చేసిన రైతుబజార్ల ఉద్దేశాన్ని వైఎస్సార్​సీపీ ప్రభుత్వం అటకెక్కించింది. అద్దెలు పెంచేసి ఆదాయవనరుగా మార్చేసింది. సౌకర్యాల కల్పన, నిర్వహణను మాత్రం విస్మరించింది. ప్రభుత్వ నిర్వాకంతో రైతులు, వినయోగదారులకు తిప్పలు తప్పడం లేదు.

ysrcp_government_neglecting_rythu_bazars_in_andhra
ysrcp_government_neglecting_rythu_bazars_in_andhra

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2023, 10:09 AM IST

రైతు బజార్లు కావవి - ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు, ప్రజలకు ధరలభారపు మార్కెట్లు

YSRCP Government Neglecting Rythu Bazars in Andhra: రైతులకు గిట్టుబాటు ధర, కొనుగోలుదారులకు చౌకగా కూరగాయలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతుబజార్ల ఉద్దేశాన్ని వైఎస్సార్​సీపీ ప్రభుత్వం నీరుగారుస్తోంది. సంస్కరణల పేరిట ఎడాపెడా అద్దెలు పెంచేసి వాటినీ ఆదాయ వనరుగా మార్చేశారు. కొత్తగా 54 రైతుబజార్లు ఏర్పాటు చేస్తున్నామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ గొప్పలు చెప్పడం తప్పితే, వాటిలో 25 శాతం కూడా పూర్తిచేయలేకపోయారు.

గతంలో ఉన్నవాటిలోనూ సౌకర్యాల కల్పనను విస్మరించారు. శీతల గదులకు తాళాలేశారు. తాగునీరు, విద్యుత్తు, సీసీ కెమెరాల పనితీరూ అంతంత మాత్రమే. మరుగుదొడ్లలోకి వెళ్లే ముక్కులు మూసుకుని కూడా ఉండలేని దుస్థితి. ఇలా మొత్తం రైతుబజారు వ్యవస్థనే అస్తవ్యస్తంగా తయారుచేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది.

అందుబాటులోకి మరిన్ని రైతు బజార్లు: మంత్రి బొత్స

అప్పటి ప్రభుత్వంలో సకల సౌకర్యాల కల్పన: పండించిన వ్యవసాయ ఉత్పత్తుల్ని రైతులే నేరుగా తెచ్చి విక్రయించుకునేందుకు 1999లో తెలుగుదేశం ప్రభుత్వం రైతుబజార్లను అందుబాటులోకి తెచ్చింది. కూరగాయలు పండించే గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా కల్పించింది. ఛార్జీల్లోనూ రాయితీలు ఇచ్చింది. అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోనూ రైతుబజార్లు అందుబాటులోకి తెచ్చారు. వాటిలో దుకాణాలు కేటాయించి గుర్తింపు కార్డులూ ఇచ్చారు. పొదుపు సంఘాలు, దివ్యాంగులకూ అక్కడ అవకాశం ఇచ్చారు.

రైతు బజార్ల వ్యవస్థ: ప్రస్తుతం రాష్ట్రంలోని 102 రైతుబజార్లలో సుమారు 5 వేల 800 దుకాణాలున్నాయి. ఇందులో 4 వేల 500 మందికిపైగా రైతులకు గుర్తింపు కార్డులు అందించారు. మార్కెట్‌ ధరలతో పోలిస్తే కిలోకు 5 నుంచి 10 రూపాయల వరకు తక్కువకే విక్రయిస్తుండటంతో, రైతుబజార్లలో రద్దీ పెరిగింది. రోజుకు సుమారు 6 లక్షల మంది వినియోగదారులు వస్తుంటారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతుబజార్లలో విద్యుత్తు, తాగునీరు, శీతల గదులు వంటి సౌకర్యాలతోపాటు వ్యర్థాల నుంచి ఎరువుల తయారీ వ్యవస్థనూ ఏర్పాటు చేశారు.

kannababu: రైతుల కోసం 2,531 బహుళ ప్రాయోజిత కేంద్రాలు: మంత్రి కన్నబాబు

రేట్లు పెంచక తప్పని పరిస్థితి తీసుకువస్తున్న వైఎస్సార్​సీపీ ప్రభుత్వం: రైతుబజార్ల నిర్వహణను మెరుగుపర్చాల్సిన ప్రభుత్వం వాటినీ ఆదాయ వనరుగానే చూస్తోంది. అద్దెల రూపంలో బాదేస్తుండటంతో, దుకాణదారులు ఆ భారాన్నంతటినీ వినియోగదారులపై మోపుతున్నారు. అంటే ప్రభుత్వమే రేట్లు పెంచక తప్పని పరిస్థితిని సృష్టిస్తోందన్నమాట. దీంతో రైతుబజార్లలోనూ అమ్మకాలు తగ్గుతున్నాయి.

బినామీ రైతుల్ని తొలగించామంటూ భుజాలు తడుముకుంటూ: 2014తో పోలిస్తే 2018 నాటికి కూరగాయల ఉత్పత్తి 13 లక్షల టన్నులు పెరిగింది. 2018తో పోలిస్తే 2022లో అమ్మకాలు మాత్రం, 26 లక్షల టన్నులు తగ్గడం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రాంతాల వారీగా ఒక్కో దుకాణానికి 15 వందల నుంచి 3 వేల రూపాయల వరకు ప్రభుత్వం అద్దెలు నిర్ణయించింది. స్వయం సమృద్ధి అంటూ బాదుడుకు తెరతీసింది. ఇలా విచ్చలవిడిగా బాదేస్తూ రైతుబజార్ల ఆదాయాన్ని ఏడాదికి 11 కోట్లకు చేర్చామంటూ సంబరాలు చేసుకుంటోంది. అదేమంటే బినామీ రైతుల్ని తొలగించి ఆదాయం పెంచామని సన్నాయి నొక్కులు నొక్కుతోంది.

YCP Followers attacked TDP workers: నిమజ్జనం కోసం వెళ్తూ... రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. తిప్పికొట్టిన టీడీపీ కార్యకర్తలు...

రైతుబజార్ల నిర్వీర్యం: రైతుబజార్ల నుంచి వెలువడే వ్యర్థాలను వృథాగా పడేయకుండా ఆయా కేంద్రాల్లోనే ఎరువుల తయారీ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం వాటిలో అధికశాతం వినియోగంలో లేకపోవడంతో యంత్రాలు తుప్పుపడుతున్నాయి. దూరప్రాంతాల నుంచి కూరగాయలు తెచ్చుకునే రైతుల కోసం ఏర్పాటు చేసిన శీతల గోదాములు, మాగబెట్టేందుకు రైపెనింగ్‌ ఏర్పాటుచేసిన ఛాంబర్స్‌ నిర్వహణ లేకపోవడంతో చాలాచోట్ల పనిచేయడం లేదు. కూరగాయల ధరల ప్రదర్శనకు లక్షల రూపాయలు వెచ్చించి అమర్చిన బోర్డులూ కాంతివిహీనంగా మారాయి. అధిక శాతం బజార్లలో సీసీ కెమెరాలు వేలాడుతూ నెలచూపులు చూస్తున్నాయి.

పడకేసిన పరిశుభ్రత: రైతుబజార్లలో శుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా స్వచ్ఛత మచ్చుకైనా కానరాదు. చెత్త, ఇతర వ్యర్థాలు రోజుల తరబడి పోగుపడుతూ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఇక వాటిల్లోని మరుగుదొడ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నీటి సరఫరా, నిర్వహణ కొరవడటంతో నిరుపయోగంగా మారాయి. భరించలేని దుర్వాసనతో విక్రయదారులతోపాటు కొనుగోలుదారులూ అవస్థలు పడుతున్నారు.

కడుపు నిండి'నోళ్లకేం' తెలుసు కరవు కష్టం - కొద్దిపాటిదే అన్నట్లుగా జగన్​ తీరు

అక్కడే కాదు రాష్ట్రంలో చాలా చోట్ల పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. విద్యుత్తు వెలుగులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇక తిరుపతి రాయలచెరువు రోడ్డులోని రైతుబజార్‌లో తాగునీటి కుళాయిని శుభ్రం చేసి ఎన్నేళ్లయిందో తెలియదు. విరిగిపోయిన మరుగుదొడ్ల తలుపులు, అటు చూస్తే వాంతి చేసుకోవాల్సిందే.

రైతు బజార్ల వ్యవస్థను పట్టించుకోని ప్రభుత్వం : రైతుబజార్ల నిర్మాణాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా వాటి ప్రారంభానికి మాత్రం వైసీపీ సర్కారు వాయిదా వేస్తూ వస్తోంది. తెలుగుదేశం హయాంలో పూర్తయిన వాటినీ అందుబాటులోకి తీసుకురాలేదు. అటు సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో రైతుబజార్లు ఇంకా వెనకబడే ఉన్నాయి. కూరగాయల ధరల వివరాలను వినియోగదారులకు మొబైల్‌ యాప్‌ ద్వారా పంపే విధానం అన్నిచోట్లూ అమలు కావడం లేదు. గతంలో ఆన్‌లైన్‌లో కన్పించేవి. ఇప్పుడు దాన్నీ తీసేశారు. ఫుడ్‌కోర్టుల ఏర్పాటు, పిల్లలు ఆడుకునేందుకు సౌకర్యాలు, ఏటీఎంలు వంటి సౌకర్యాలు కాగితాలకే పరిమితమయ్యాయి.

కౌలు రైతు కన్నీటి గాథ సర్కారుకు వినిపించడం లేదా

ABOUT THE AUTHOR

...view details