YSRCP Government Failed : గ్రామీణ, పట్టణ పేదలందరికీ కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించటమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం చేపట్టినట్లు అధికార పార్టీ నేతలు, అమాత్యులు ఎంతగా హడావుడి చేసినా ప్రజలు ఆ శిబిరాల వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష (Jagananna Arogya Suraksha) శిబిరాలు జనం లేక వెలవెలబోయాయి. వైద్య, ఆరోగ్య శాఖమంత్రి విడదల రజని (Minister Vidadala Rajani) చినపలకలూరు ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరానికి స్పందన కరవైంది. ఈ గ్రామంలో 2,400 మంది జనభా ఉండగా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పట్టుమని 100 మంది కూడా వైద్య పరీక్షలకు రాలేదు.
People Reject Jagananna Arogya Suraksha Scheme :జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమానికి ప్రజల నుంచి అనుకున్నఆదరణ దక్కలేదు. గుంటూరు జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖమంత్రి విడదల రజని ఆరోగ్య శిబిరాన్నిఆర్భాటంగా ప్రారంభించినా అదే పరిస్థితి. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లోజగనన్న ఆరోగ్య సురక్షమెుదటి దశ కార్యక్రమాన్ని నామమాత్రంగా నిర్వహించి ప్రభుత్వం మమ అనిపించింది. ఇప్పుడు రెండో దశ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రజల ఆరోగ్య సమస్యలకు వారి ఇంటి ముంగిటిలోనే పరిష్కారాన్ని, వైద్య సేవల్ని అందిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది. కానీ వాస్తవానికి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
పార్టీ ప్రచారం కోసం పీహెచ్‌సీలపై చిన్నచూపు - జగనన్న ఆరోగ్య సురక్షకు కోట్ల రూపాయల ఖర్చు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టగా ప్రజలు ఈ శిబిరాలకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. చినపలకలూరు ప్రభుత్వ పాఠశాలలో వైద్య, ఆరోగ్య శాఖమంత్రి విడదల రజని జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ప్రారంభించి అలా వెళ్లగానే ఇలా శిబిరం ఖాళీ అయింది. గ్రామంలో దాదాపు 2400 మంది జనాభా ఉండగా కేవలం 100 కూడా వైద్య పరీక్షల కోసం నమోదు చేసుకోలేదు.