ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YSRCP Government Cheating Tenant Farmers: ఇచ్చిన హామీలపై చేతులెత్తేసిన సీఎం జగన్‌.. పంట రుణాలు దక్కడం లేదని కౌలురైతుల ఆవేదన - కౌలు రైతు కార్డులు

YSRCP Government Cheating Tenant Farmers: టీడీపీ హయాంలో ఏడాదికి రూ.4వేల కోట్లకు పైగా పంట రుణాలిస్తే.. జగన్‌ ప్రభుత్వం మాత్రం అందులో సగం కూడా ఇప్పించలేకపోయింది. రాష్ట్రంలో ఏటా ఇచ్చే మొత్తం పంట రుణాల్లో వారికి కేవలం ఒక శాతం మాత్రమే దక్కుతోందనే విషయం వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తెలుసా? కౌలు రైతులకు ఏమి మేలు చేశారని వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేయాలని వారంతా నిలదీస్తున్నారు.

YSRCP Government Cheating Tenant Farmers
YSRCP Government Cheating Tenant Farmers

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2023, 7:53 AM IST

YSRCP Government Cheating Tenant Farmers: కౌలు రైతులకు ఇచ్చిన హామీలపై చేతులెత్తేసిన సీఎం జగన్‌..కౌలు కార్డులు, పంట రుణాలు దక్కడం లేదని రైతులు ఆవేదన

YSRCP Government Cheating Tenant Farmers :"ప్రతి కౌలు రైతుకూ చెబుతున్నా.. అధికారంలోకి రాగానే గుర్తింపు కార్డులు ఇస్తాం. వడ్డీ లేకుండా బ్యాంకు రుణాలు వచ్చేలా చేస్తాం. వారికి అన్నిరకాలుగా తోడుంటాం" అని 2018 ఆగస్టు 5న కత్తిపూడి ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ ఊదరగొట్టారు. కౌలు రైతుల్ని ఆదుకుంటామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక వారి గోడే పట్టించుకోవడం లేదు.

Tenant Farmers Worried about Loans In AP : రాష్ట్రంలో 24 లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉన్నారు. మొత్తం సాగులో 40% విస్తీర్ణంలో వీరే పంటలు వేస్తారు. అయినా కౌలు రైతు కార్డులు అందవు కార్డులున్నా పంట రుణాలు దక్కవు. గతేడాది మొత్తం 1.41 లక్షల కోట్ల రూపాయలు పంట రుణాలిస్తే అందులో కౌలు రైతులకు ఇచ్చింది 1,544 కోట్ల రూపాయలు అంటే కేవలం 1% మాత్రమే.

Tenant farmers Problems: సమస్యలన్నీ పరిష్కరిస్తానన్న జగన్​.. మాపై చిన్నచూపు ఎందుకంటున్న కౌలురైతులు

CM Jagan Forget Their Promises about Loans for Farmers :ఈ ఏడాది ఖరీఫ్‌లోనూ 950 కోట్ల రూపాయలతోనే సరి పెట్టారు. టీడీపీ హయాంలో గరిష్ఠంగా ఏడాదికి 4వేల కోట్ల రూపాయలకు పైగా పంట రుణాలు ఇప్పించేవారు. వైసీపీ ప్రభుత్వంలో పంట రుణాలు దొరక్క బయట అప్పులు చేసి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనుకోని విపత్తు ఎదురైనా.. చీడపీడలు ఆశించినా, ధరలు దక్కకపోయినా కౌలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. చాలా మంది రెండు రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు. సగటున ఒక్కో కౌలు రైతుపై రూ.2లక్షలకు పైనే అప్పు ఉందని అంచనా వేస్తున్నారు.

Tenant Farmers Problems in AP : రాధాకృష్ణ కమిషన్‌ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 24 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు గుర్తించారు. అందరికీ గుర్తింపు కార్డులు, పంట రుణాలు దక్కడం లేదు. మొత్తం పంట రుణాల్లో కనీసం 10% కౌలు రైతులకు ఇవ్వాలని గతంలో లక్ష్యాలు పెట్టారు. వైసీపీ వచ్చాక దాన్ని కుదించింది. ఈ ఏడాది 8.10 లక్షల మందికి సాగుదారు హక్కు కార్డులు ఇవ్వగా.. అందులో 1.41 లక్షల మందికే రుణాలిచ్చారు.

Tenant Farmers Association: 'కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలి.. లేదంటే..'

సంఘాలుగా ఏర్పాటైన 1.71లక్షల మందినీ కలిపితే మొత్తం 3.12లక్షల మందికి పంట రుణాలందాయి. ఈ ఏడాది కౌలు రైతులకు 4వేల కోట్ల రూపాయలు పంట రుణాలు లక్ష్యంగా నిర్ణయించగా.. సెప్టెంబరు వరకు ఖరీఫ్‌లో ఇచ్చినవి 950 కోట్ల రూపాయలు మాత్రమే. నిర్దేశిత లక్ష్యంలో 24% కూడా చేరలేదు.

గతంలో సాగు అవసరాలకు బంగారం తాకట్టుపై 7% వడ్డీకి బ్యాంకులు పంటరుణాలు ఇచ్చేవి. ఏడాదిలోగా చెల్లిస్తే కేంద్రం వడ్డీ రాయితీగా 3% మినహాయింపు ఇచ్చేది. మూడేళ్లుగా వడ్డీ రాయితీని ఎత్తేశారు. కౌలు రైతులకు సహకార సంఘాల ద్వారా పంటరుణాలు ఇప్పిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆచరణలో విఫలమైంది.

Prathidhwani సర్కారుకు కనిపించని.. కౌలు రైతు కష్టాలు..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details