గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద వైకాపా, తెదేపా నేతలు ఘర్షణ పడ్డారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైకాపా కార్యకర్తలు నినాదాలు చేయడంపై.. ఐకాస నేతలు వాగ్వాదానికి దిగారు. పోటాపోటీ నినాదాలతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. స్పందించిన పోలీసులు.. రోప్ లు అడ్డుపెట్టి ఇరువర్గాలను చెదరగొట్టారు. రిలే నిరాహార దీక్షా శిబిరంపై టమాటా, కోడిగుడ్లతో వైకాపా కార్యకర్తల దాడి చేశారు. తెనాలి పట్టణ తెదేపా అధ్యక్షుడు మహ్మద్ ఖుద్దూస్ పై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఘటనాస్థలికి మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేరుకున్నారు.
తెనాలిలో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య తోపులాట.. తీవ్ర ఉద్రిక్తత - తెనాలి మున్సిపాల్ కార్యాలయం వద్ద వైకాపా గొడవ న్యూస్
గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెదేపా అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వైకాపా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఐకాస నేతలు వారితో వాగ్వాదానికి దిగారు.
తెనాలిలో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య తోపులాట