YSRCP 2024 MLA Candidates First List : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని పది నెలలు కూడా సమయం లేకపోవడంతో అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ ఆభ్యర్థుల తొలి జాబితాను దసరా తర్వాత విడుదల చేయనుంది. ఈ జాబితాలో పార్టీ తరఫున కొత్తగా బరిలో దిగే వారి పేర్లను ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి, తర్వాత అధికార పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్న వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్‌తోపాటు జనసేన నుంచి గెలిచి వైసీపీ పంచన చేరిన రాపాక వరప్రసాద్‌కు టిక్కెట్ ఇవ్వడంపై తొలి జాబితాలోనే స్పష్టత ఇవ్వనున్నారు.
CM Jagan on Pre Elections: షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు.. మంత్రులకు సీఎం జగన్ స్పష్టం
Andhra Pradesh Assembly Elections 2024: 2019లో వైసీపీ ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఇన్నాళ్లూ పార్టీ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న వారిలో కొందరి అభ్యర్థిత్వాన్ని సైతం తొలి జాబితాలోనే ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇటీవల అధికార పార్టీకి దూరమైన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నియోజకవర్గాల్లోనూ తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆస్థానాల్లో పార్టీ సమన్వయకర్తలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, కత్తెర సురేష్, నేదురుమల్లి రామకుమార్‌రెడ్డిలను నియమించారు. వీరిలో ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే టికెట్ ఇవ్వొచ్చని సమాచారం. తొలి జాబితాలోనే దీనిపై స్పష్టత వస్తుందని అధికారపార్టీ వర్గాలు చెబుతున్నాయి.
YCP MLA Candidates Frist List Will be Released in Dussehra: మహిళలు, బీసీలకు ఈసారి ఎక్కువ ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందన్నారు. ఎన్నికల నాటికి అన్ని విధాలా సిద్ధం కావడం కోసమే కొత్త వారి పేర్లను తొలి జాబితాలో ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నవంబరు ఆఖరులో తొలి జాబితా, వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత తుది జాబితా విడుదల చేయాలని సీఎం జగన్ పరిశీలిస్తున్నారు.