వైఎస్సార్ పింఛను కానుక పథకంలో భాగంగా.. వృద్ధులకు, వితంతువులకు ఇస్తున్న పింఛన్ రూ.2,250 నుంచి రూ.2,500 లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెంచిన పింఛన్.. జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
ముఖ్యమంత్రి జగన్ గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పెదనందిపాడు ఆర్స్ట్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న బహిరంగసభలో సీఎం పాల్గొంటారు.