ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడికొండలో వైకాపా ఆవిర్భావ వేడుకలు - ysr congress party commemoration day news

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని వైకాపా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి.. కేక్​ కట్​ చేసి సంబరాలు చేశారు.

ysr congress party commemoration day
వైకాపా ఆవిర్భావ వేడుకలు

By

Published : Mar 12, 2021, 1:48 PM IST

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని వైకాపా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్సార్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్​ కట్​చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం జగన్మోహన్​ రెడ్డి నాయకత్వంలో పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని జగన్​ అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి..అధికారంలోకి రాగానే సీఎం.. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details