ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేదల కోసం పాటుపడిన గొప్ప నేత వైఎస్సార్' - గుంటూరులో వైయస్సార్ జయంతి వేడుకల వార్తలు

గుంటూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి పాల్గొన్నారు. పేదలకోసం పాటుపడిన గొప్ప నేత వైఎస్సార్ అని కొనియాడారు.

ysr birth anniversary celebrations in guntur by congress party
గుంటూరులో వైయస్సార్​కు కాంగ్రెస్ నివాళి

By

Published : Jul 8, 2020, 4:09 PM IST

పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర్ రెడ్డి అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్​వలి అన్నారు. గుంటూరు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్సార్ ఎనలేని కృషి చేశారని మస్తాన్​వలి కొనియాడారు. వైఎస్సార్ మరణం తర్వాత రాష్ట్రంలో ధ్రుతరాష్ట్రుడి పాలన ప్రారంభమైందని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించాయన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలనే పేర్లు మార్చి తమవిగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ప్రధాని మోదీ దగ్గర మోకరిల్లిందని మండిపడ్డారు. ఇప్పటికైనా మెరుగైన పాలన అందించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details