ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలింపు - YS Sharmila hunger strike stopped

తన పాదయాత్ర అనుమతి కోసం వైఎస్​ షర్మిల చేపట్టిన నిరహార దీక్షను తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు ప్రకటించిన తరువాత.. అర్ధరాత్రి షర్మిలను అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించారు.

వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం
వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం

By

Published : Dec 11, 2022, 9:14 AM IST

వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ నిరాహారదీక్షను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఆరోగ్యం క్షీణించినట్లు ప్రకటించారు. దీంతో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. షర్మిల దీక్ష శిబిరం వద్దకు మీడియా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. ఈనెల 9న లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద షర్మిల ఆమరణదీక్షకు దిగారు.

అసలెేం జరిగిదంటే:ప్రజాప్రస్థాన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల ఆమరణ నిరాహర దీక్ష చేపట్టారు. మొదట లోటస్‌పాండ్ ఎదుట రోడ్డుపై బైఠాయించి.. ఆందోళన చేస్తుండటంతో కొద్దిసేపటి వరకు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన దీక్ష విరమించాలని పోలీసులు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అనడంతో బలవంతంగా రోడ్డుపై నుంచి ఇంట్లోకి పంపించారు. ఈ నేపథ్యంలో షర్మిల.. తెలుగుతల్లి ఫ్లైఓవర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్​ విగ్రహం వద్ద బైఠాయించి, నిరసన వ్యక్తం తెలిపారు.

ఈ సందర్భంగా సైఫాబాద్ పోలీసులు ఆమెను అరెస్టు చేసిన తన నివాసం లోటస్‌పాండ్‌కు తరలించారు. కానీ, ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె రోడ్డుపై ఆమరణ దీక్షకు ఉపక్రమించారు. దీంతో పోలీసులు బలవంతంగా రోడ్డుపై నుంచి ఇంట్లోకి పంపడంతో తన నివాస ప్రాంగణంలో షర్మిల ఆమరణ దీక్ష కొసాగించారు.

వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details