ఏ పదవికైనా.. అనుభవంతో పాటు ఆలోచనలూ అవసరం. అందుకే సరికొత్త ఆలోచనలతో.. మంచి పరిపాలన అందించడమే లక్ష్యంగా పల్లె పోరులో యువత పోటీ పడుతున్నారు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం అందుకూరు సర్పంచిగా గిరిజ పోటీ చేస్తున్నారు. ఆమె ఇంజనీరింగ్ పూర్తి చేసి.. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగిగా రాణిస్తున్నారు.
సర్పంచ్ బరిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి..
గిరిజకు నెలరోజుల క్రితమే బాపట్లకు చెందిన యువకుడితో పెళ్లయింది. అయితే ఆమె స్వగ్రామం అందుకూరులో సర్పంచ్ స్థానానికి మహిళకు రిజర్వు కావడంతో.. గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. తన భర్తతో పాటు అత్తింటివారు కూడా గిరిజను పోటీ చేయించేందుకు అంగీకరించారు. గిరిజ పోటీపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఉన్నత విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు.
వార్డు సభ్యురాలిగా సీఏ విద్యార్థిని సాజీదా...