గుంటూరు జిల్లాలో వర్చువల్ విధానం ద్వారా యువజనోత్సవాలు కొనసాగుతున్నాయి. కొవిడ్ కారణంగా ఆన్ లైన్ విధానంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. జానపద నృత్యాలు, మ్యాజిక్, మిమిక్రీ, కర్ణాటక సంగీతం, ప్లూట్, గిటార్, హార్మోనియం, మృదంగం, పాశ్చాత్య నృత్య పోటీల్లో యువజనులు, విద్యార్థులు తమ సత్తాను చాటారు. నేడు ఈ వేడుకలకు చివరి రోజు అని కార్యనిర్వహకులు తెలిపారు. నేరుగా పోటీలు లేకపోయినప్పటికి.... ఈ కొత్త విధానంతో కాస్త సంతృప్తికరంగా ఉందని విద్యార్థులు అన్నారు.
వర్చువల్ విధానం ద్వారా యువజనోత్సవాలు - గుంటూరు తాజా వార్తలు
యువజనోత్సవాల్లో భాగంగా...ఆన్ లైన్ విధానంలో పోటీలను నిర్వహిస్తున్నారు. పోటీలకు ఈ రోజు చివరిరోజు అని కార్యనిర్వహకులు తెలిపారు.

వర్చువల్ విధానం ద్వారా యువజనోత్సవాలు