ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీవీఐటి కళాశాలలో ఉత్సాహంగా యువజనోత్సవాలు - youth festival news

కుర్రకారు కేరింతలు, యువతుల ఆటపాటలతో... గుంటూరు జిల్లాలోని వీవీఐటి ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణం హోరెత్తింది. యువజనోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు... యువతలోని సృజనను, కళాత్మకతను వెలికితీశాయి. రాష్ట్రవ్యాప్తంగా వందకుపైగా కళాశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు పాల్గొని సందడి చేశారు.

youth fest in vvit college
వీవీఐటి కళాశాలలో ఉత్సాహంగా యువజనోత్సవాలు

By

Published : Dec 22, 2019, 6:34 AM IST

వీవీఐటి కళాశాలలో ఉత్సాహంగా యువజనోత్సవాలు

గుంటూరు జిల్లా నంబూరు సమీపంలోని వీవీఐటి కళాశాలలో యువజనోత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను వెలికితీసి... వారిని వివిధ రంగాల్లో ప్రోత్సహించడానికి ఏటా 2 రోజుల పాటు వీటిని నిర్వహిస్తారు. ఈ ఏడాది వేడుకలకు రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి వందలాదిగా విద్యార్థులు తరలివచ్చారు.

మొదటిరోజు కార్యక్రమాలు సందడిగా సాగాయి. కళాశాలలో ఎటుచూసినా విద్యార్థుల హడావుడి కనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాల్లోకి మళ్లీ వెళదాం అనే నేపథ్యంతో ఉత్సవాలు సాగుతున్నాయి. ఎక్కడ చూసినా డిస్నీల్యాండ్‌ బొమ్మలు కనిపించాయి. రకరకాల గేమ్‌ షోలతో విద్యార్థులు స్టాళ్లను ఏర్పాటు చేశారు. సెల్ఫీలు దిగుతూ స్టాళ్లలో కలియతిరుగుతూ... యువత సందడి చేశారు. గ్రామీణ నేపథ్యంతో కూడిన సెట్లు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఎప్పుడూ చదువులుతో తీరిక లేకుండా ఉండే తమకు... ఇలాంటి కార్యక్రమాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయని యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమలో అంతర్గతంగా ఉండే నైపుణ్యాలను బయటకు తీసేందుకు ఈ వేడుకలు ఎంతో ఉపకరించాయని విద్యార్థులు చెబుతున్నారు. జీవితంలో చదువు ఒక్కటే భాగం కాదన్న వీవీఐటి కళాశాల ఛైర్మన్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌... ఇలాంటి వేడుకల వల్ల విద్యార్థుల్లో ఉండే ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు.

ఇదీ చదవండీ...

'మూడు రాజధానుల నిర్ణయం సరైనదే'

ABOUT THE AUTHOR

...view details