ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బిల్లు ఎక్కువ వేశారని ఆస్పత్రి సిబ్బందిపై యువకుడు దాడి - గుంటూరు జిల్లా వార్తలు

గుంటూరు జిల్లా దాచేపల్లి క్రాంతి నర్సింగ్ హోమ్‌ సిబ్బందిపై యువకుడు దాడి చేశారు. ఆస్పత్రి బిల్లు ఎక్కువ వేశారని సిబ్బందిపై యువకుడు చేయిచేసుకున్నారు. ఆస్పత్రి సీసీ కెమెరాల్లో ఘర్షణ దృశ్యాలు నమోదయ్యాయి.

Youth attacked hospital staff
Youth attacked hospital staff

By

Published : Dec 11, 2020, 9:34 AM IST

బిల్లు ఎక్కువ వేశారని ఆస్పత్రి సిబ్బందిపై యువకుడు దాడి

గుంటూరు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఓ నర్సింగ్ హోమ్​ సిబ్బంది బిల్లు ఎక్కువ వేశారని ఆరోపిస్తూ రోగి బంధువులు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రి ఫీజు విషయంపై నిలదీసిన రోగి బంధువులను సిబ్బంది బయటకు వెళ్లమంటూ నెట్టారు. ఆగ్రహంతో యువకుడు సిబ్బందిపై చేయిచేసుకున్నాడు.

అక్కడున్న వైద్యుడు బయటకు వచ్చి వారికి సర్దిచెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది. సిబ్బంది తీరు మార్చుకోమని చెప్పి రోగి బంధువులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘర్షణ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details