తుపాకీ చూపించి భయభ్రాంతులకు గురిచేస్తోన్న నలుగురు యువకులను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తూపాకీతో దారినపోయేవారిని బెదిరించి, వీలైనంత వరకు దోచుకుని ఈ ముఠా పైశాచిక ఆనందం పొందుతుందని పోలీసులు వెల్లడించారు. నగరంలోని రామిరెడ్డితోట వద్ద డిగ్రీ చదువుతున్న ఈ నలుగురు విద్యార్ధులు పోలీసుల పేరుతో తుపాకీ చూపించి ఇటీవల మల్లికార్జున్ అనే యువకుడి సెల్ ఫోన్ లాక్కుని వెళ్తుండగా, పోలీసులకు పట్టుబడ్డారు. యువకులు ప్రయాణిస్తున్న కారును, తుపాకీని వారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన చైతన్యకృష్ణ అమెరికా వెళ్లే సన్నాహాల్లో ఉండగా, అతని పాస్ పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుపాకీ అసలుదా నకిలీదా అనే విషయాన్ని తేల్చే పనిలో ఉన్నట్లు డీఎస్పీ నజీముద్దీన్ తెలిపారు.
తుపాకీతో భయభ్రాంతులకు గురిచేస్తోన్న ముఠా అరెస్ట్ - guntur
చదువుకుంటున్న వయసులో జల్సాలకు అలవాటు పడటమే కాకుండా, దారినపోయేవారిని భయభ్రాంతులకు గురిచేస్తోన్న ముఠాను అరెస్టు చేశారు గుంటూరు పోలిసులు.
యువకులను పట్టుకున్న పోలీసులు