ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్... అమరావతి జోలికొస్తే నీ రాజకీయ జీవితం పతనమే !' - cpi ramakrishna latest news

జగన్ మూడు రాజధానులంటే.. ప్రజలు ఆయనను జగ్లక్ అంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అన్ని పార్టీలు వ్యతిరేకిస్తుంటే.. వైకాపా మాత్రమే రాజధాని మార్పు కోరుకుంటుందన్నారు. జగన్​కు ఒక రాజధాని కట్టడం చేతకాదు కానీ.. మూడు కడతానంటూ ప్రగల్భాలకు పోతున్నారని ఎద్దేవా చేశారు.

సీపీఐ రామకృష్ణ
సీపీఐ రామకృష్ణ

By

Published : Feb 4, 2020, 9:06 PM IST

Updated : Feb 5, 2020, 7:09 AM IST

రాజధాని విషయంలో కేంద్రం డ్రామా చూస్తుందని సీపీఐ రామకృష్ణ మండిపాటు

ప్రపంచంలో తానెక్కడా మూడు రాజధానులు చూడలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అమరావతి జోలికొస్తే... జగన్ రాజకీయ పతనం ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రంలో 49 రోజులుగా రాజధాని రైతులు నిరసన వ్యక్తం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం డ్రామా చూస్తుందే తప్ప స్పందించటం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తుంటే.. వైకాపా మాత్రమే రాజధాని మార్పు కోరుకుంటుందని అన్నారు. జగన్​కు ఒక రాజధాని కట్టడం చేతకాదు కానీ.. మూడు కడతానంటూ ప్రగల్భాలకు పోతున్నారని ఎద్దేవా చేశారు.

Last Updated : Feb 5, 2020, 7:09 AM IST

ABOUT THE AUTHOR

...view details