Youngster arrested for social media post: మానవబాంబుగా మారి సీఎంను చంపుతానని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన యువకుడిని.. సీఐడీ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను సైబర్ క్రైం ఎస్పీ రాధిక వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన రాజాపాలెం ఫణి.. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. ఈ నెల 16న ట్విటర్‌లో పెట్టిన పోస్టుపై తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించినట్టు తెలిపారు. అయితే, వెంటనే ఆ పోస్టు డిలీట్ చేయడంతో పాటు.. నిందితుడు ట్విటర్ అకౌంట్ మూసేశాడు. ఫోన్ కూడా స్విచాఫ్ చేశాడు. అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఫణిని అరెస్టు చేశామని..నిందితుడు జనసేన మద్దతుదారుడని ఎస్పీ రాధిక తెలిపారు. ఇలాంటి పోస్టులు పెట్టే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఆ వ్యక్తికి మాకు సంబంధం లేదు: జనసేన మీడియా విభాగం