గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో.. శనివారం ఎడతెరపి లేని వర్షం కురిసింది. చిలకలూరిపేట మండలం మానుకొండవారి పాలెం-వేలూరు మధ్య ఉన్న కుప్పగంజి వాగు చప్టాపై ఎగువ కురిసిన వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వేలూరు గ్రామానికి చెందిన దాసు అనే యువకుడు చిలకలూరిపేట నుంచి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తూ వాగు దాటే క్రమంలో నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయాడు. మధ్యలో చెట్టును పట్టుకొని వేలాడుతూ ప్రాణాలు కాపాడుకునేందుకు పెద్దగా కేకలు వేశాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పురపాలక చైర్ పర్సన్ షేక్ రఫాని, పోలీస్, రెవెన్యూ , అగ్నిమాపక అధికారులు యువకుడిని కాపాడారు. యువకుడు ప్రాణాలతో బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వాగులో చిక్కుకున్న యువకుడు.. కాపాడిన అధికారులు - చిలకలూరి పేటలో వాగులో చిక్కుకున్న యువకుడు
భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఓ యువకుడు వాగులో చిక్కుకు పోయాడు. అప్రమత్తమైన అధికారులు అతణ్ని కాపాడారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
YOUNGMEN STRUCTED IN FLOOD AT CHILAKALURIPETA