ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్యావరణానికి కృషి... మహిళలకు ఉపాధి - jute bags latest story

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలనేదే... చిన్ననాటి నుంచి ఆమె ఆలోచన. మహిళలు సొంతకాళ్లపై నిలబడాలనేదే లక్ష్యం. ఈ రెండూ కలిసి ఆ మహిళని జనపనార బ్యాగుల తయారీ వైపు మళ్లించాయి. ఆమె ఆశయానికి... స్వచ్ఛంద సంస్థ ప్రోత్సాహంతోపాటు ప్రభుత్వ సహకారమూ లభించింది. ఫలితంగా... తన ఆలోచనలు, లక్ష్యాలను సాకారం చేసుకునేందుకు మార్గం సుగమమైంది.

జనపనార బ్యాగులను తయారు చేస్తున్న మహిళలు
జనపనార బ్యాగులను తయారు చేస్తున్న మహిళలు

By

Published : Nov 28, 2020, 7:32 PM IST

జనపనార బ్యాగులను తయారు చేస్తున్న మహిళ

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అంజుం... జనపనార బ్యాగుల తయారీలో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇంటర్మీడియట్ వరకూ చదివిన అంజుం....స్వయం శక్తితో ఎదగాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే... సొంతంగా ఏదైనా చేతివృత్తుల యూనిట్ ప్రారంభించాలని భావించారు. చిన్నప్పటి నుంచి పర్యావరణంపై మక్కువ ఉండటంతో... తాను చేసే పని పర్యావరణానికి మేలు చేసేలా ఉండాలని తలచారు.

ఆ ధృడ సంకల్పతోనే... జనపనార బ్యాగుల తయారీపై హైదరాబాద్ లోని ఎలీప్ లో రెండు నెలల శిక్షణ తీసుకున్నారు. కొన్ని బ్యాగులు తయారు చేసి బంధుమిత్రులకు ఇవ్వగా... వారి నుంచి ప్రశంసలు లభించాయి. మరో అడుగు ముందుకేసి.... 50వేల రూపాయల పెట్టుబడితో ఇంటిపైనే చిన్నపాటి యూనిట్ ప్రారంభించారు. మహిళలు ఉపయోగించే అన్నిరకాల బ్యాగులను తయారు చేస్తున్నారు.

ఈ బ్యాగులు పర్యావరణహితం..

జనపనారతో తయారు చేసే ఈ బ్యాగులు పర్యావరణహితం. ఈ బ్యాగులు... బహుమతులు ఇచ్చేందుకు, ల్యాప్ ట్యాప్‌లు పెట్టుకునేందుకు.... ఇలా ప్రతి అవసరాలకు తగిన విధంగా... రూపొందిస్తున్నారు. బ్యాగుల తయారీతో మహిళలకు ఉపాధి కూడా లభిస్తుందని... అంజుం తెలిపారు.

జనపనార సంచులు పర్యావరణ పరిరక్షణకు ఉపయెగపడుతాయన్న ఉద్దేశంతో.... అంజుం చేస్తున్న ప్రయత్నానికి.... రెయిన్ బో ట్రస్టు సహకారం అందిస్తోంది. అంజుం చేస్తున్న ప్రయత్నం.... పర్యావరణానికి మేలు చేయటంతో పాటు మహిళల ఆర్థిక స్వావలంబనకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఇదీ చదవండి:

దారుణం.. సైనైడ్​తో భర్తను చంపించిన భార్య

ABOUT THE AUTHOR

...view details