ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SUICIDE: అపార్టుమెంట్ పైనుంచి దూకి యువతి ఆత్మహత్య - చిలకలూరిపేటలో యువతి ఆత్మహత్య

SUICIDE: అపార్టుమెంట్ పైనుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

SUICIDE
SUICIDE

By

Published : Jan 2, 2022, 1:27 PM IST

SUICIDE: గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం రైతు బజార్ సమీపంలోని ఓ అపార్ట్​మెంట్​ పైనుంచి.. దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన యువతి సుభాషిణి(30)గా గుర్తించారు. ఆమె ప్రముఖ ఆడిటర్ అన్నదాత కుమార్తె.

సుబ్బయ్యతోటలోని ఇంటి వద్ద నుంచి అపార్టుమెంట్​లో ఉన్న ఫ్లాట్​కు వెళ్తున్నట్లు చెప్పి సుభాషిణి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ.. అపార్టుమెంట్​లోని నివాసానికి వెళ్లకుండా.. ఐదవ అంతస్తుకి వెళ్లి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఆమెను అక్కడి వారు సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై సమాచారం అందుకున్న అర్బన్ ఎస్సై మోహన్ ఘటనాస్థలికి చేరుకున్నారు.

అనారోగ్యంతో పాటు మానసికంగా బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. యువతి ఆత్మహత్యకు మరేమైనా ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇదీ చదవండి:woman missing: భార్య కోసం భర్తల గాలింపు.. అసలేం జరిగిందంటే?

ABOUT THE AUTHOR

...view details