గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందింది. సత్తెనపల్లి మండలం రొంటపాళ్ళకు చెందిన సాయి నిఖిత.. తమ సమీప బంధువుతో కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు బయటకు వచ్చింది. కారు గ్రామ శివారుకు వచ్చిన తర్వాత రోడ్డు ప్రక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్ళింది.
బావిలో నీళ్లు ఉన్న కారణంగా.. కారు సగం మేర మునిగిపోయింది. వెంటనే స్థానికులు స్పందించి కారుతో పాటు అందులో ఉన్న ఇద్దరిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నిఖిత శరీరంలోకి నీరు ఎక్కువగా వెళ్లి ఉన్న కారణంగా చనిపోయిందని వైద్యులు తెలిపారు.