ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువతి ప్రాణాన్ని బలిగొన్న మాస్క్ వివాదం - గుంటూరు జిల్లాలో యువతి హత్య వార్తలు

గుంటూరు జిల్లా రెంటచింతలలో మాస్క్ వివాదం ఓ యువతి ప్రాణాలను బలిగొంది. ప్రత్యర్థులు తండ్రిపై దాడి చేస్తుంటే అడ్డుకొని తన ప్రాణాలనే ఫణంగా పెట్టింది. 8 రోజులు మృత్యువుతో పోరాడి అసువులు బాసింది.

young woman died in a dispute over not wearing a mask in guntur district
young woman died in a dispute over not wearing a mask in guntur district

By

Published : Jul 12, 2020, 5:05 PM IST

బాధిత కుటుంబం ఆవేదన
మాస్క్ వేసుకోలేదని జరిగిన వివాదంలో యువతి మృతి చెందిన సంఘటన రెంటచింతలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రెంటచింతల పిచ్చికుంట వీధిలో నివాసం ఉంటున్న కర్నాటి యలమంద వ్యక్తిగత పనులపై చెరువు సమీపంలోని వీధిలో మాస్క్‌ లేకుండా వెళ్లాడు. అక్కడున్న యువకులు మాస్క్‌ లేకుండా వచ్చినందుకు అభ్యంతరం తెలిపారు.

కొద్ది రోజుల తరువాత చెరువు సమీప వీధి యువకులు పిచ్చికుంట బజారుకు మాస్క్‌ లేకుండా రావటంతో యలమంద బంధువులు అభ్యంతరం వ్యక్తం చేయగా ఈనెల 3న(శుక్రవారం) ఘర్షణ నెలకొంది. నలుగురు కర్రలతో యలమందపై దాడి చేశారు. అడ్డొచ్చిన కుమార్తె కర్నాటి ఫాతిమా(19) తలకు బలమైన గాయాలయ్యాయి. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. తండ్రి యలమంద ఫిర్యాదు మేరకు నలుగురిపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్సై చల్లా సురేష్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details