గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కేసానుపల్లి పరిధిలోని లలితాదేవి కాలనీలో ఉంటున్న మంద సాయివేణు, బలుసుపాటి వీరాంజనేయులు స్నేహితులు. బుధవారం రాత్రి ఇద్దరూ కలిసి మద్యం తాగుతుండగా చిన్న వివాదం చెలరేగింది. అది చినికి చినికి గాలివానగా మారింది.
ఆగ్రహంతో సాయి వేణు, వీరాంజనేయుల్ని కత్తితో పొడిచి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు.